Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ మామూలోడు కాదు.. మరో కొత్త ప్రయోగం

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 8 November 2021, 6:10 pm

Anchor Pradeep  : యాంకర్ ప్రదీప్ బుల్లితెరపై ఎంతటి స్టార్డంను సొంతం చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ప్రదీప్ అన్ని చోట్లా షోలు చేస్తున్నాడు. అందరినీ అలరిస్తూనే ఉన్నాడు. హోస్ట్, యాంకర్‌గా ప్రదీప్ ఇప్పటికే తన సత్తాను చాటుకున్నాడు. అయితే అప్పుడప్పుడు ప్రదీప్ పేరు ఎక్కువగా కాంట్రవర్సీ అవుతుంది. ముక్కూమొహం తెలియని వాళ్లు కూడా ప్రదీప్ పేరు వాడుకుంటారు. వార్తల్లో నిలుస్తంటారు.

Anchor Pradeep Machiraju Super Queen Show

Anchor Pradeep Machiraju Super Queen Show

అలాంటి ప్రదీప్ బుల్లితెరపై మంచి ఫాంలో ఉన్నాడు. ఇక ఇప్పుడు ఓటీటీల్లోనూ దుమ్ములేపుతున్నాడు. ఆహా కోసం సర్కార్ అనే కొత్త షోను చేస్తున్నాడు. ఇక ఇప్పుడు జీ తెలుగు కోసం మరో షోను చేస్తున్నాడు. ప్రదీప్ కెరీర్ పుట్టిందే జీ తెలుగు. గడుసరి అత్త సొగసరి కోడలు అనే షోను సక్సెస్ ఫుల్‌గా రన్ చేసి ఫేమస్ అయ్యాడు యాంకర్ ప్రదీప్. అలా మధ్యలో జీ తెలుగు, ఈటీవీ అంటూ రెండింట్లోనూ దుమ్ములేపేశాడు. ప్రస్తుతం ప్రదీప్ ఢీ షోతో బిజీగా ఉన్నాడు.

Anchor Pradeep  : కొత్త షోతో ప్రదీప్ రచ్చ..

జీ తెలుగులో సరిగమపను నడిపించాడు. దాని తరువాత ఇప్పుడు మళ్లీ కొత్త షోకు హోస్ట్‌గా రాబోతోన్నాడు. సూపర్ క్వీన్ అంటూ బుల్లితెర తారలతో ఓ ఆట ఆడించేందుకు రాబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇందులో కార్తీకదీపం మోనిత, బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి, లాస్య, భాను శ్రీ వంటివారున్నారు. బుల్లితెర సీరియల్ నటీనటులు కూడా ఉన్నాడు. వెండితెరపై నవ్వులు పూయించే స్నిగ్ద కూడా ఉంది. మొత్తానికి ఏదో కొత్త కాన్సెప్ట్‌తోనే ప్రదీప్ రాబోతోన్నాడు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp