Karthika Deepam Hima : డాక్టర్ బాబుని హిమ అలా పిలుస్తుందా?.. ఇదేం పిలుపురా సామీ

Authored By aruna | The Telugu News | Published on: August 18, 2022, 3:20 pm

Karthika Deepam Hima : డాక్టర్ బాబు, వంటలక్క కార్తీక దీపం సీరియల్లోకి మళ్లీ వచ్చారు.వారి రాకతో కార్తీక దీపం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఇన్నిరోజులు వారు లేకపోవడంతొ ఆ సీరియల్‌ను ఎవ్వరూ పట్టించుకోలేదు. రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. అయితే లాభం లేదని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయి మళ్లీ వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలను పట్టుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా రేటింగ్స్ ఊపందుకున్నాయి. ఇక వంటలక్క, డాక్టర్ బాబు, హిమ, శౌర్య ఇలా అందరూ మళ్లీ వచ్చారు. కథ ప్రస్తుతం గతంలోకి వెళ్లింది. ఆ చిన్న పిల్లలు శౌర్య, హిమలు, దీప, కార్తీక్ మధ్య కథ నడుస్తోంది. దీంతో రేటింగ్స్ బాగానే వస్తాయ్ అని చెప్పొచ్చు. అయితే ఇన్నేళ్లు కలిసి నటించారు.

చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి హిమ, శౌర్యలు దీప, కార్తీక్‌లతోనే ఉన్నారు. అంటే ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాలతోనే హిమ (సహృద), శౌర్య (కృతిక)లు సెట్‌లోనే ఎక్కువ టైం గడుపుతుంటారు. మామూలుగా అయితే ఆన్ స్క్రీన్‌లో ఎలాంటి రిలేషన్ ఉంటే.. బయట కూడా అలానే పిలుస్తుంటారు. కానీ మన హిమ మాత్రం డాక్టర్ బాబు నాన్న అని పిలవడం లేదు. నిన్న (ఆగస్ట్ 17) నిరుపమ్ బర్త్ డే. అందరూ స్పెషల్ విషెస్ అందించారు. డాక్టర్ బాబుకి బర్త్ డే విషెస్ అని ప్రేమీ విశ్వనాథ్, శౌర్యలు విషెస్ చెబుతూ పోస్టులు వేశారు. ఇక హిమసైతం ఓ పోస్ట్ వేసింది.

Karthika Deepam Hima aka Sahruda Calls Nirupam Paritala

Karthika Deepam Hima aka Sahruda Calls Nirupam Paritala

హ్యాపీ బర్త్ డే అన్నయ్య అంటూ నిరుపమ్‌కు విషెస్ చెప్పింది. అదేంటి? అన్నయ్య అని అనడం అంటూ అందరూ ఆశ్చర్యపోతోన్నారు. మొత్తానికి నిరుపమ్ మాత్రం ఆ పిల్లలతో ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ సెట్‌లో ఎంతో సరదాగా ఉంటాడు. ఇప్పుడు కార్తీకదీపంలోకి మళ్లీ మోనితను తీసుకురండి.. ఆమె మాత్రం ఏ పాపం చేసింది.. డాక్టర్ బాబు,వంటలక్కలను తీసుకురండి అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరి మళ్లీ మోనిత,వంటలక్క, డాక్టర్ బాబుల చుట్టూ కథ తిరుగుతుందా? లేదా? ఎలా కథనం సాగుతుందో చూడాలి.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp