Pradeep Machiraju : యాంకర్ ప్రదీప్ ఒక్క రోజు పారితోషికం ఎంతో తెలుసా?

Advertisement

Pradeep Machiraju : బుల్లితెర యాంకర్గా ప్రదీప్ సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. నటుడిగా ఆయన ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు దక్కించుకున్నాడు, తెలుగులో ఆయన హీరోగా ఒక సినిమా కూడా వచ్చింది. ఆ తర్వాత ఏమైందో కానీ హీరోగా సినిమా ఇంకా చేయడం లేదు. ప్రస్తుతం వరుసగా షో లు చేసుకుంటూ వస్తున్నాడు. తెలుగులో బుల్లి తెర పై యాంకర్ సుమ తర్వాత అత్యధిక ఆదరణ కలిగిన యాంకర్ గా ప్రదీప్ కొనసాగుతున్నాడు. ఆయన యాంకర్ గా చేసేందుకుగాను ఒక్కొక్క ఎపిసోడ్ కి భారీ మొత్తంలో పారితోషికాన్ని తీసుకుంటాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

Advertisement

ప్రస్తుతం ఆయన చేస్తున్న షో లకు గాను ఒక్కొక్క ఎపిసోడ్కి ఏకంగా ఐదు లక్షల రూపాయలను తీసుకుంటాడని సమాచారం అందుతోంది. ఒక్క కాల్ షీట్ కి 5 లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. సినిమాల్లో నటిస్తున్న చిన్న హీరోలకు సైతం ఆ స్థాయిలో పారితోషకం ఉండే అవకాశం లేదు. కేవలం యాంకర్గా ప్రదీప్ కి మాత్రమే ఈ స్థాయి ఉంది. జబర్దస్త్ కమెడియన్స్ గా మంచి పేరు దక్కించుకున్న సుధీర్ మరియు ఆది కూడా ఈ స్థాయిలో పారితోషికం తీసుకోరు అని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ తన తదుపరి సినిమా కు సంబంధించిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని సమాచారం అందుతోంది.

Advertisement
Pradeep Machiraju One day Remuneration
Pradeep Machiraju One day Remuneration

కథ బాగా ఉండి, నచ్చితేనే సినిమా చేస్తాను అంటూ చెబుతున్నాడు. అందుకే మొదటి సినిమా వచ్చి ఇన్నాళ్లు అయినా కూడా ఇప్పటి వరకు ఆయన తదుపరి సినిమాను మొదలు పెట్టలేదట. హీరోగా కూడా ఈయన పారితోషకం ను రోజువారీ గానే తీసుకుంటాడని సమాచారం అందుతుంది. అలా తీసుకోవడం వల్ల కోటి రూపాయల వరకు పారితోషికంగా అందే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారి మాట. యాంకర్ ప్రదీప్ చాలా తెలివిగా కెరియర్ ని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు అని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు యాంకర్గా బిజీగా కొనసాగిస్తూనే మరోవైపు సినిమాలు వరుసగా నటించాలి అనుకోవడం మంచి ఆలోచనే అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement