Anchor Rashmi : దెబ్బకు సోఫా వెనక్కి వెళ్లి దాక్కున యాంకర్ రష్మీ.. కారణం అదే
Anchor Rashmi : యాంకర్ రష్మీ ప్రస్తుతం హవా కొనసాగిస్తోంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్ని షోల్లోనూ కనిపిస్తోంది. సుధీర్ వెళ్లిపోవడంతో రష్మీకి మరో చాన్స్ దక్కింది. అలా అన్నింట్లోనూ సోలో యాంకర్‌గా దూసుకుపోతోంది. అనసూయ వెళ్లిపోవడంతో జబర్దస్త్ దొరికితే.. సుధీర్ వెళ్లిపోవడంతో శ్రీదేవీ డ్రామా కంపెనీ దొరికినట్టు అయింది. రష్మీ ప్రస్తుతం మూడు షోలను బ్యాలెన్స్ చేస్తోంది. ఇక బుల్లితెరపై రష్మీ సందడి మరింత పెరిగినట్టు అయింది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో రష్మీ మరింత ఓపెన్‌గా ఉంటున్నట్టు కనిపిస్తోంది.
ఎక్కువ మాట్లాడటం, ఇంటరాక్ట్ అవ్వడం, పంచులు వేయడం, అందరిపైనా సెటైర్లు వేయడం వంటివి చేస్తోంది.రష్మీ మీద సైతం ఆది, రాం ప్రసాద్‌లు పంచ్‌లు వేస్తుంటారు. సుధీర్ టాపిక్ పరోక్షంగా తీస్తూ రష్మీని ఆడుకుంటారు. అలా శ్రీదేవీ డ్రామా కంపెనీ ముందుకు సాగుతోంది. వచ్చే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను కాసేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో జాన పద గాయకులను తీసుకొచ్చారు. ఉత్తరాంద్ర నుంచి వాళ్లు వచ్చినట్టు కనిపిస్తోంది. రష్మీది కూడ ఆ ఏరియానే. రష్మీది ఒరిస్సా అన్న సంగతి తెలిసిందే. వైజాగ్‌లో రష్మీ సెటిలైంది. అయితే ఆ ఫోక్ సింగర్ కాస్త రష్మీని ఉద్దేశించి పాట పాడినట్టు కనిపిస్తోంది. దీంతో రష్మీ తెగ సిగ్గు పడిపోయింది. ఇదేంటి అన్నట్టుగా బిత్తరపోయింది.
దెబ్బకు సోఫా వెనక్కి వెళ్లి కూర్చుంది.మొత్తానికి రష్మీ మాత్రం ఆ పర్ఫామెన్స్‌కు ఫిదా అయినట్టుంది. ఇక రష్మీ ఈ ప్రోమోలో మరింత అందంగా కనిపించింది. ఆ పాట వస్తుంటే.. రష్మీని చూపించడం, ఆమె ముసి ముసి నవ్వులతో ప్రోమో అదిరిపోయింది. ఇక ఇదే ప్రోమోలో లేడీ కండక్టర్ డ్యాన్స్ పర్ఫామెన్స్ హైలెట్ అయింది. శ్రీదేవీ డ్రామా కంపెనీ మొత్తం ఎపిసోడ్‌లలో ఇదే హైలెట్ అయ్యేట్టుంది. ఆ లేడీ కండక్టర్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు ఆమని ఫిదా అయింది. స్టేజ్ మీదున్న ఆర్టిస్టులంతా కూడా ఫిదా అయ్యారు. ఆమెతో కలిసి కాలు కదిపారు. అలా ఈ ఎపిసోడ్ కోసం జనాలు అంతా కూడా వెయిట్ చేస్తున్నారు.