Anchor Rashmi : ఇక్కడ జంతువు ఎవరో తెలుస్తోంది.. ఆగ్రహించిన యాంకర్ రష్మీ
anchor rashmi : ప్రముఖ యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ.. తన ఫొటోలను పోస్ట్ చేయడం, అప్‌డేట్స్ ఇవ్వడమే కాకుండా సామాజిక అంశాల మీద కూడా స్పందించారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల నీచమైన కామెంట్స్ చేసేవారి పట్ల రష్మీ తనదైన శైలిలో విరుచుకుపడిన ఘటనలు చూస్తునే ఉన్నాం.
అయితే జంతు ప్రేమికురాలైన రష్మీ.. వాటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంది. జంతువులను ప్రేమించాలని చెబుతుంది. అంతేకాకుండా తన వంతుగా వాటిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా కుక్కల విషయంలో రష్మీ చాలా కేర్ తీసుకుంటుంది. లాక్‌డౌన్ సమయంలో కూడా ఆహారం లేక తల్లడిపోతున్న కుక్కలకు బయటకు వచ్చి ఫుడ్ పెట్టింది రష్మీ. దీన్ని బట్టి ఆమెకు అవి అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలనే వాటికి హాని తలపెట్టేవారిపై రష్మీ విరుచుకుపడుతుంటారు.

anchor rashmi fires on a man who attacks dog
anchor rashmi : వీడియోపై రష్మీ కామెంట్
తాజాగా ఓ వ్యక్తి కుక్కను పట్టుకుని దాన్ని ఇబ్బందికి గురిచేస్తున్న వీడియో ఒకటి రష్మీ దృష్టికి వచ్చింది. దీని తన ఇన్‌స్టా స్టేటస్‌లో పోస్ట్ చేసిన రష్మీ.. ఇక్కడ జంతువు ఎవరో తెలుస్తుంది అంటూ ఘాటైన కామెంట్ చేసింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి కుక్కను తనవద్దకు తీసుకుని బలవంతంగా హింసించడం చేస్తుంటాడు. చెవులను పట్టుకుని లాగుతూ ఉంటాడు. అది అరుస్తున్న పట్టికోకుండా అలానే చేస్తుంటాడు. ఇంతలో అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చిన ఆవు అతనిపై దాడి చేస్తుంది.