Rashmi Gautam : ఆ ఉద్యోగిపై సీఎంకు రష్మి గౌతమ్ కంప్లయింట్.. ఎందుకో తెలుసా?
Rashmi Gautam : బ్యూటిఫుల్ యాంకర్ రష్మి గౌతమ్ బుల్లితెరపై చేసే సందడి అందరికీ తెలుసు. ఈ భామ యాంకర్ గానే కాకుండా మానవతావాదిగాను, ప్రకృతి ప్రేమికురాలిగానూ పేరు తెచ్చుకుంది. కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో మూగజీవులకు ఆహారం సప్లై చేసి తన మానవత్వాన్ని చాటుకుంది. ప్రపంచంలో ఎక్కడైనా మూగ జీవులను హింసించొద్దని రష్మి గౌతమ్ చెప్తుంటుంది. ఎవరైనా హింసించినట్లు ఆమె దృష్టికి వస్తే వెంటనే ఆ ఘటనపై రియాక్ట్ అవుతుంటుంది. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి జరగగా, మూగ జీవాన్ని హింసించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రికి రష్మిగౌతమ్ కంప్లయింట్ చేసింది. ఆ ఘటన ఎక్కడ జరిగిందంటే..
వీధికుక్కలను కాపాడుకోవాలని నినదించే రష్మి గౌతమ్.. వాటికి చేతనైనంత సాయం చేయాలని పిలుపునిస్తుండటం మనం చాలా సార్లు చూశాం. ఇకపోతే తాజాగా రష్మి గౌతమ్.. సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న ఓ వీడియోను చూసి బాధపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీలోని ఓ జ్యూలో ఉద్యోగి.. అక్కడ ఉండే జంతువును హింసిస్తున్నాడు. అలా అకారణంగా యానిమల్ ను కొట్టడం చూసిన రష్మి గౌతమ్..బాగా సీరియస్ అయింది. ఉద్యోగిపైన ఫైర్ అయింది. అలా చేయడానికి ఉద్యోగికి సిగ్గు ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Rashmi Gautam : వాటికి జీవితాంతం లాక్ డౌన్ ఉంటుందన్న రష్మి..
ఈ క్రమంలోనే రష్మి గౌతమ్ సదరు జూ ఉద్యోగిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి మేనకాగాంధీలను ప్రతీ ఒక్కరు ట్యాగ్ చేయాలని సోషల్ మీడియాలో కోరింది. దాంతో నెటిజన్లు వారిని ట్యాగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూలోని యానిమల్స్ ను హింసించడం నేరమని రష్మి పేర్కొంది. మనం ఒక మూడు నెలలు లాక్ డౌన్ లో ఉండలేకపోయాం, అటువంటిది యానిమల్స్ లైఫ్ లాంగ్ లాక్ డౌన్ అన్నట్లుగా జూలో ఉంటాయని, అటువంటి వాటిని కొట్టరాదని అంది రష్మి.