Rashmi Gautam : నేను యాంకర్ అంటే ఎవ్వరూ నమ్మడం లేదు : రష్మీ గౌతమ్

Authored By aruna | The Telugu News | Published on: July 24, 2022, 5:30 pm

Rashmi Gautam : యాంకర్ రష్మీకి తెలుగు రాదని, యాంకరింగ్ రాదని అందరూ సెటైర్లు వేస్తుంటారు. ఇక రష్మీ మాట్లాడే తెలుగు మీద అయితే లెక్కలేనన్ని కౌంటర్లు వేస్తుంటారు. ఆది, రాం ప్రసాద్ వంటి వారు రష్మీ తెలుగు మీద ఎన్ని రకాల జోకులు వేస్తుంటారు అందరికీ తెలిసిందే. అయితే రష్మీ మాత్రం వాటిని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. తాము ఏది చేసినా కూడా జనాలను ఎంటర్టైన్ చేసేందుకే కదా?అని రష్మీ అనుకుంటుంది. అయితే తాజాగా రష్మీ మాత్రం తన మీద తానే జోకులు వేసుకుంది.

అసలే ఇప్పుడు రష్మీ మంచి ఫాంలో ఉంది. సుధీర్ వెళ్లిపోయాక.. శ్రీదేవీ డ్రామా కంపెనీని రష్మీ బాగానే నడిపిస్తోంది. సుధీర్ రిఫరెన్సులు తీసుకుంటూనే షోను ముందుకు తీసుకెళ్తున్నారు. బాబు, బాబు అంటూ సుధీర్‌ను గుర్తు చేస్తూ, రష్మీకి లింక్ పెడుతూ ఆది బాగానే నడిపిస్తున్నాడు. ఇక రష్మీ మీద కౌంటర్లు వేయడంలో మాత్రం ఆది, రాం ప్రసాద్ పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో అయితే తన మీద తానే సెటైర్లు వేసుకుంది. ఇంతకీ ఆ ప్రోమోలో ఏముందంటే..

Anchor Rashmi Gautam Self Satires in Extra Jabardasth Latest Promo

Anchor Rashmi Gautam Self Satires in Extra Jabardasth Latest Promo

నేను యాంకరింగ్ చేస్తున్నా కూడా నన్ను ఎవ్వరూ యాంకర్ అని అనడం లేదు.. గుర్తించడం లేదు అని వర్ష అంటుంది. నన్నే ఇంకా ఎవ్వరూ యాంకర్ అంటే నమ్మడం లేదు.. ఇంకా నిన్నేం నమ్ముతారు అని మధ్యలో రష్మీ కౌంటర్లు వేస్తుంది. అలా తన మీద తానే కౌంటర్లు వేసుకుంది రష్మీ. ఇక ఈ ప్రోమోలో అందరికీ అందరికీ ఓ సర్ ప్రైజ్ వచ్చింది. గెటప్ శ్రీను సడెన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. గెటప్ శ్రీను రాకతో ఈ ఎపిసోడ్ ప్రోమోకు ఊపొచ్చింది. అయితే గెటప్ శ్రీను పర్మినెంట్‌గా వచ్చాడా? లేదా గెస్ట్ రూపంలో వచ్చాడా? అన్నది చూడాలి.

ఇక గెటప్ శ్రీను పర్మనెంట్‌గా వస్తే.. మెల్లిగా సుధీర్‌‌ను కూడా మల్లెమాల టీం లాగే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అసలే ఇప్పుడు మల్లెమాల, జబర్దస్త్ మీద అందరికీ బ్యాడ్ ఓపినీయన్ ఏర్పడింది. కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్లు నెట్టింట్లో దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp