Rashmi Gautam : పెళ్లి కుదిరిందట.. మొత్తానికి అసలు మ్యాటర్ చెప్పేసిన యాంకర్ రష్మీ

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 20 July 2022, 12:00 pm

Rashmi Gautam : యాంకర్ రష్మీ బుల్లితెరపై చేసే సందడి మామూలుగా ఉండదు. అయితే రష్మీ వయసు, ప్రేమ, పెళ్లి మీద ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. రష్మీ మీద తోటీ నటీనటులే సెటైర్లు వేస్తుంటారు. అలా రష్మీ ఇప్పుడు బుల్లితెరపై మామూలు ఫాంలో లేదు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఆమె ఇప్పుడు దూసుకుపోతోంది. సుధీర్ స్థానంలో యాంకర్‌గా రష్మీ ఎంట్రీ ఇచ్చింది. రష్మీ కూడా బాగానే నడిపిస్తోంది. షోను తన స్టైల్లో ముందుకు తీసుకెళ్తోంది. ఇక షోలో సుధీర్ లేకపోయినా కూడా అతని రిఫరెన్సులు మాత్రం బాగానే ఉంటున్నాయి.

యాంకర్ రష్మీ పెళ్లి విషయంలో అనేక రూమర్లున్నాయి. ఆమెకు ఇది వరకే పెళ్లి అయిందని, విడాకులు అయ్యాయనే ఓ రూమర్ కూడా చక్కర్లు కొడుతుంటుంది. అయితే ఆ రూమర్ మీద మాత్రం ఎలాంటి క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. ఇక బుల్లితెరపై రష్మీ సుధీర్ జోడి మామూలుగా హిట్ అవ్వలేదు. ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్టు ప్రేక్షకుల ముందు నటిస్తుంటారు. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి అందరూ ఫిదా అవుతుంటారు. అయితే అదంతా కూడా తెరపై మాత్రమే. తెర వెనుక వీరిద్దరూ మామూలు ఫ్రెండ్సే. క ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ కోసం రష్మీ మరింత ముందుకు వచ్చింది. వచ్చే ఆదివారం రష్మీ మీద ఓ ప్రోగ్రాంను ప్లాన్ చేశారు.

Anchor Rashmi Opens About Her Love And Marriage

Anchor Rashmi Opens About Her Love And Marriage

అక్కా బావెక్కడ అంటూ రాబోతోన్న ఈ ఎపిసోడ్‌లో రష్మీ తన ప్రేమను బయటపెట్టబోతోంది. మీరు ఇన్నాళ్లు ఎదురుచూసిన ప్రశ్నకు సమాధానం చెప్పబోతోన్నాను.. నా పెళ్లి గురించి చెప్పబోతోన్నాను.. నాకు పెళ్లి కుదిరింది అంటూ రష్మీ తెగ సిగ్గు పడింది. మెలికల్ తిరుగుతూ వయ్యారాలు ఒలకబోసింది. రష్మీ చేసిన ఈ ప్రకటనను మాత్రం ఎవ్వరూ నమ్మడం లేదు. ఇదంతా కూడా షో కోసమే చేసిందని, అందులో చివరకు ఏమీ ఉండదని అందరూ తేల్చి చెప్పేస్తున్నారు. మరి నిజంగానే అక్కా బావెక్కడ అనే ఈ ఎపిసోడ్ కోసం మల్లెమాల, శ్రీదేవీ డ్రామా కంపెనీ వేసిన పబ్లిసిటీ స్టంట్ అనా? అని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి