Bigg Boss 5 Telugu : ఆ ఒక్క మాటతో కథ మారింది!.. మానస్‌ను వదలని శ్రీరాచంద్ర, రవి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 5 Telugu : ఆ ఒక్క మాటతో కథ మారింది!.. మానస్‌ను వదలని శ్రీరాచంద్ర, రవి

 Authored By bkalyan | The Telugu News | Updated on :1 November 2021,2:40 pm

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో ఎనిమిది వారాలు ముగిశాయి. ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. సరయు, ఉమా దేవీ,లహరి, నటరాజ్ మాస్టర్, హమీద, శ్వేత, ప్రియ, లోబో ఇలా ఎనిమిది ఇంటి నుంచి బయటకు వెళ్లారు. నిన్న జరిగిన లోబో ఎలిమినేషన్‌తో మొత్తంగా ఎనిమింది బయట ఉండగా.. 11 మంది లోపల ఉన్నారు. ఈ 11 మందిలో ఇప్పుడు అసలు పోరు సాగబోతోంది. ఇప్పటికే నామినేషన్ల పర్వానికి సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది.

anchor ravi sreerama chandra tragets manas and sunny

anchor ravi sreerama chandra tragets manas and sunny

ఈ ప్రోమోను బట్టి చూస్తే ఈ వారం కాస్త వేడిగానే ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. క్రీమ్ పుయ్ నామినేష్ వెయ్యి అంటూ ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగబోతోన్నట్టుంది. గత సీజన్‌లో కూడా ఈ క్రీమ్ నామినేషన్లు పెట్టేశాడు. అయితే ఈ సారి నామినేషన్ ప్రక్రియలో ఒకే ఒక విషయం ఎక్కువగా హైలెట్ అయ్యేలా ఉంది. మానస్ అన్న ఒక్క మాటను పట్టుకుని శ్రీరామచంద్ర, యాంకర్ రవి తెగ ఊగిపోతోన్నారు. మానస్, సన్నీ, కాజల్ ఒక గ్రూప్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ల రచ్చ..

anchor ravi sreerama chandra tragets manas and sunny

anchor ravi sreerama chandra tragets manas and sunny

ఇదే విషయాన్ని ఆనీ మాస్టర్ అనేసింది. ముగ్గురు కలిసి ఆడతారు.. ముగ్గురు కలిసి మాట్లాడతారు అని అంది. మేం ముగ్గురం అయితే.. అక్కడ ఐదుగురు ఉన్నారంటూ మానస్ అనేస్తాడు. ఇక ఆ ఐదుగురు ఎవరు? అంటూ అప్పటి నుంచి రవి, శ్రీరామచంద్ర ప్రశ్నిస్తున్నాడు. మేం గ్రూపుగా లేం.. ఆ ఐదుగురు ఎవరో చెప్పాలి? అంటూ నామినేషన్ల సమయంలోనూ అడిగేశాడు. గుమ్మడి కాయల దొంగ ఎవరు? అంటూ భుజాలు తడము కున్నట్టు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు అంటూ సన్నీ మానస్‌లు రవి శ్రీరామచంద్రకు కౌంటర్లు వేశారు.

 

View this post on Instagram

 

A post shared by STAR MAA (@starmaa)

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది