Bigg Boss 5 Telugu : భార్య,కూతురిని చూడటంతో లేచొచ్చిన ప్రాణం.. యాంకర్ రవి కంటతడి
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ షోకి యాంకర్ రవి వెళ్లడం ఏంటో గానీ ఫుల్ నెగెటివ్ ఇమేజ్ ఏర్పడింది. గుంట నక్క అనే పేరును సార్థకం చేసుకున్నాడు. అందరి దగ్గరకి వెళ్లడం.. అక్కడివి ఇక్కడ.. ఇక్కడివి అక్కడ చెప్పడం, అబద్దాలు ఆడటం, ఒట్టేసి కూడా అబద్దాలు చెప్పడం రవికే చెల్లుతుందో. ఎన్నో సందర్భాల్లో రవి అడ్డంగా బుక్కయ్యాడు. అలా మొత్తానికి రవి ఇమేజ్ కాస్త పడిపోయింది.
అయితే నేటి ఎపిసోడ్‌లో యాంకర్ రవి భార్య నిత్య, పాప వియా బిగ్ బాస్ ఇంట్లోకి రాబోతోన్నారు. చాలా రోజులుగా రవి తన భార్యను, పాపను మిస్ అవుతున్న సంగతి తెలిసిందే. రవిని చూసేందుకు ఆయన భార్య నిత్య మొదటగా ఇంట్లోకి వచ్చింది. పాప రాలేదని అబద్దం చెప్పింది. ఎంతో ట్రై చేశాను కానీ బిగ్ బాస్ వాళ్లు ఒప్పుకోలేదని అన్నారు. మొత్తంగా తన పాప ఎంట్రీ ఇస్తుందని తెలియడంతో రవి ఆనంధాని అవధుల్లేకుండా పోయాయి.

Anchor Ravi Wife Nitya And Daughter Viya In Bigg Boss House
Bigg Boss 5 Telugu : యాంకర్ రవి కంటతడి
పాప రాకతో రవి కంట్లో నీళ్లు తిరిగాయి. పాపను గుర్రమెక్కించుకుని ఆడించాడు. పాపతో కలిసి అందరూ ఎంజాయ్ చేశారు. అలా పాప కోసం రవి, తండ్రి కోసం వియా పడ్డ ఎమోషన్‌ను ప్రోమోలో చూపించారు. ప్రోమో అయితే అందరినీ టచ్ చేసేసింది. మరి ఎపిసోడ్‌లో ఎలా ఉంటుందో చూడాలి. ఇన్ని రోజులు రవి ఎదురుచూసిన మూమెంట్ అయితే వచ్చేసింది.
Daughter ni chusaka #Ravi emotions are priceless ❤️ #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/RZLbVj0sIT
— Starmaa (@StarMaa) November 26, 2021