anchor shiva remuneration for Bigg Boss OTT Telugu
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతుంది. ఈ సీజన్ ప్రారంభం అయిన సమయం లో కంటెస్టెంట్స్ విషయం లో చాలా మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి సీజన్ సమయంలో కూడా వచ్చే విమర్శలు మరియు వ్యతిరేకత ఈ కొత్త సీజన్ ప్రారంభం సమయంలో కూడా కంటెస్టెంట్స్ విషయంలో తీవ్ర స్థాయిలో షో నిర్వాహకులు ఎదుర్కోవలసి వచ్చింది. వీరితో ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తారు అంటూ ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా లో బిగ్ బాస్ టీం ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఇలాంటి సమయంలో నిర్వాహకులు సక్సెస్ఫుల్ అయ్యారు అనడంలో సందేహం లేదు.
ప్రతి ఒక్క కంటెస్టెంట్ నుండి తమకు కావాల్సిన కంటెంట్ను లాక్కుంటూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు అంటూ నెటిజెన్స్ స్వయంగా కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ సమయంలో ఇంట్లో అత్యంత ఎంటర్టైన్మెంట్ వ్యక్తిగా యూట్యూబ్ యాంకర్ శివ నిలిచాడు. ఆయన బిందు మాధవి తో కలిసి చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఆయనకు సంబంధించినంత వరకు ప్రతి ఒక్క ఎపిసోడ్లో కూడా ప్రతి ఒక్కరి తో కలిసి సరదాగా గడుపుతూ అందరినీ ఆటపట్టిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేస్తున్నాడు. ఒకప్పుడు డ్రైవర్ గా పని చేసిన ఈయన యూట్యూబ్లో లో టిక్ టాక్ సెలబ్రిటీ లను ఇంటర్వ్యూ చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఏ మాత్రం గుర్తింపు లేని వాళ్ళని తన ఇంటర్వ్యూల తో మంచి గుర్తింపు వచ్చేలా చేశాడు.
anchor shiva remuneration for Bigg Boss OTT Telugu
ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ల తో బిగ్ బాస్ లోకి వచ్చిన శివ పారితోషికం ఎంతో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. బిగ్బాస్ నిర్వాహకుల నుండి మాకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం యాంకర్ శివకు వారానికి లక్షన్నర చొప్పున పారితోషికం ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చారు. ఐదు వారాలకు మించి ఉంటే ఆరవ వారం నుండి రెండున్నర లక్షల పారితోషికం ఇస్తామని బిగ్ బాస్ నిర్వాహకులు అగ్రిమెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే యాంకర్ శివ కి తక్కువ పారితోషికం ఇస్తున్నారు.. అయినా కూడా ఆయనకు వస్తున్నా గుర్తింపు ఖచ్చితంగా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.