shyamala..ఈ వయసులో అందాలతో మాయ చేస్తున్న యాంకర్ శ్యామల.. వైరల్ పిక్స్
shyamala..తెలుగు యాంకర్స్‌లో ఎప్పుడూ చీరల్లోనే దాదాపుగా కనిపించే యాంకర్ శ్యామల. చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈమె పలు సినిమాల్లోనూ నటించింది. ఇకపోతే బుల్లితెరపై సీరియల్స్, వంటల ప్రోగ్రాంలలోనూ శ్యామల కనిపిస్తుంది. కాగా, ఇటీవల కాలంలో శ్యామల మోడ్రన్ ట్రెండీ డ్రెస్సెస్ వేసుకుంటున్నది.
ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సదరు ఫొటో చూసి నెటిజన్లు యాంకర్ శ్యామల గేర్ మార్చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్రీమ్ కలర్ టాప్ బ్లూ స్కర్ట్ వేసుకొని దిగిన ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. ఈమె శ్యామలనేనా అని కొందరు నెటిజన్లు ఆ ఫొటో చూసి పోస్టులు పెడుతున్నారు.
అదేంటీ.. ఇలా సంప్రదాయ ప్రతీక అయిన చీరను వదిలి మోడ్రన్ డ్రెస్‌లోకి షిఫ్ట్ అయింది శ్యామల అని చర్చించుకుంటున్నారు. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే శ్యామల ఏంటిలా మోడ్రన్ డ్రెస్సెస్‌లో కనిపించి వివాదాల్లో చిక్కుకుంటుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్యామల పలు సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేస్తూనే యాంకరింగ్ కూడా చేస్తుంటుంది…
ఇకపోతే ఇటీవల యాంకర్ శ్యామల భర్త, బుల్లితెర నటుడు నర్సింహారెడ్డిని హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ విదితమే. తన వద్ద నుంచి కోటి రూపాయలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసిన క్రమంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.