Home » Entertainment » Jabardasth New Anchor
Entertainment

Jabardasth : జబర్దస్త్ కి వచ్చిన ఆ కొత్త యాంకర్ ఎవరో తెలుసా భయ్య

Authored By
aruna
The Telugu News | Published on: July 31, 2022, 6:40 pm
Advertisement

Jabardasth : జబర్దస్త్ కామెడీ షో మరో టర్న్ తీసుకుంది, ఇప్పటికే ఎంతో మంది కమెడియన్స్ వెళ్ళి పోయారు. వారితో పాటు జడ్జిలు ఇద్దరు కూడా వెళ్ళి పోయారు. ప్రస్తుతం జడ్జీలుగా వస్తున్న వాళ్లు ఎవరు అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సమయంలో యాంకర్లు కూడా అటూ ఇటూ అవుతుండడంతో ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా జబర్దస్త్ నుండి అనసూయ అవుట్ అయిన విషయం తెలిసిందే. జబర్దస్త్ కి దూరమవుతున్నట్లు గా ఇప్పటికే ప్రకటించిన అనసూయ స్టార్ మా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Advertisement

జబర్దస్త్ లో అనసూయ ప్లేస్ ని భర్తీ చేసేదెవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా వచ్చిన ప్రో మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వారం జబర్దస్త్ యాంకర్ రాబోతుంది ఈమె అంటూ టీం మెంబర్స్ అంతా కూడా చేసిన సందడి ప్రోమో లో ఆసక్తికరంగా మారింది. ఇంతకు రాబోతున్న ఆ కొత్త యాంకర్ ఎవరు అనేది ఆసక్తిగా మారిన నేపథ్యంలో మల్లెమాల వారి నుండి మాకు అందిన సమాచారం ప్రకారం రష్మి గౌతమ్ ఆ ప్లేస్ ని భర్తీ చేయబోతున్నట్లు గా తెలుస్తోంది గతంలో కూడా అనసూయ వెళ్లి పోయిన సమయంలో రష్మి గౌతమ్ జబర్దస్త్ నడిపించింది.

Jabardasth New Anchor

Advertisement

ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ కోసం వారంలో రెండు రోజులు రష్మి గౌతమ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు గా సమాచారం అందుతోంది. ఇప్పటికే శ్రీదేవి డ్రామా కంపెనీ కి యాంకర్గా వ్యవహరిస్తున్న రష్మి గౌతమ్ త్వరలోనే జబర్దస్త్ రెండు ఎపిసోడ్ లను కూడా యాంకరింగ్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతోంది. అనసూయ కంటే రష్మీ ఎందులోనూ తక్కువ కాదని ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితమైంది. కనుక జబర్దస్త్ కు ఏమాత్రం లోటు లేకుండా రష్మి గౌతమ్ నిర్వహించి తీరుతుంది అంటూ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. కొన్ని వారాల తర్వాత జబర్దస్త్ కొత్త యాంకర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మల్లెమాల వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి