Sreemukhi : శ్రీముఖి టైమ్‌ నడుస్తోంది.. నెం.2 గా రూ.3 లక్షలతో దూసుకు పోతోంది

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 11, 2022, 7:00 pm

Sreemukhi : తెలుగు బుల్లి తెరపై యాంకర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు సుమ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె ఎక్కువ శాతం మంది ప్రేక్షకులకు చేరువ అయ్యింది. ప్రతి ఇంట్లో కూడా సుమ పేరు వినిపిస్తుంది. భారీ ఎత్తున సుమ గురించిన వార్తలు వస్తూనే ఉంటాయి. ఒక్కో కాల్షీట్ కు ఏకంగా 5 లక్షల రూపాయల పారితోషికంను సుమ తీసుకుంటు ఉంటుంది. ఆ విషయం ను చాలా మంది ఇప్పటికే నిర్థారించిన విషయం తెల్సిందే. ఇప్పుడు సుమ తర్వత స్థానంను బుల్లితెర రాములమ్మ అయిన శ్రీముఖి దక్కించుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

శ్రీముఖి యొక్క ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుమ స్థాయిలోనే వాక్చాతుర్యం ఎక్కువ అయినా కూడా ఆమె మాటలు డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్లుగా ఉంటాయి అంటూ కొందరు విమర్శలు చేస్తూ ఉంటారు. కొందరు మాత్రం శ్రీముఖి యాంకరింగ్ ను మెచ్చుకుంటూ ఉంటారు. బుల్లి తెరపై ఆమె కనిపిస్తే అలా చూస్తూ ఉండి పోయే వారు చాలా మంది ఉంటారు. కేవలం మాటలతోనే కాకుండా అందంతో కూడా ఆకట్టుకునే ఈ అమ్మడు ఏ స్థాయి లో ఎంటర్‌ టైన్మెంట్‌ ను అందిస్తుందో ఆమె అభిమానులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

anchor sreemukhi remuneration for day is record

anchor sreemukhi remuneration for day is record

నటిగా కూడా ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీముఖి ప్రస్తుతం బుల్లి తెరకే పూర్తిగా టైమ్ కేటాయించింది. సుమ తర్వాత అంతటి క్రేజ్ ను దక్కించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం నెం.2 గా దూసుకు పోతుంది. దాదాపుగా మూడు లక్షల రూపాయలను ఒక్క రోజు కాల్షీట్ కు తీసుకుంటూ సక్సెస్ ఫుల్‌ స్టార్‌ యాంకర్ గా పేరు దక్కించుకుంది. ముందు ముందు మరింత స్టార్‌ డమ్‌ ను శ్రీముఖి దక్కించుకోగలదు అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. హీరోయిన్ గా శ్రీముఖి కి ఆఫర్లు వస్తున్నా కూడా చిన్నా చితక ఆఫర్లు అవ్వడంతో కేవలం బుల్లి తెరకే పరిమితం అయ్యింది. అందుకే శ్రీముఖి కి భారీగా పారితోషికం అందుతోంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp