Anchor Suma : సుమకే లైన్ వేసేస్తున్నాడు.. వామ్మో మామూలోడు కాదు!

Authored By Cinema Desk | The Telugu News | Updated on: March 10, 2021, 8:30 pm

Anchor Suma : బుల్లితెరపైన యాంకర్ సుమకు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. అయితే సుమను అందరూ కూడా అక్కా అనే పిలుస్తుంటారు. సుమతో పులిహోర కలిపే బ్యాచ్ అంటూ ఏది ఉండదు. అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఈవెంట్లలో అలీ కాస్త హద్దులు దాటుతుంటాడు. కానీ సుమ మాత్రం తనశైలిలో కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. అయితే సుమ వయసు మీద ఎప్పుడూ కూడా చర్చలు జరుగుతూనే ఉంటుంది.

సుమ కూడా పదే పదే ఆ విషయాలు ట్రెండింగ్‌లోకి వచ్చేలా సెటైర్లు వేస్తుంటుంది. తన వయసు గురించి తానే కామెంట్లు చేసుకుంటుంది సుమ. అయితే సుమ హోస్ట్‌గా వస్తోన్న బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షో గురించి అందరికీ తెలిసిందే. భాష తెలియని వాళ్లెవరో వచ్చి వారి ప్రతిభను చూపిస్తుంటారు. డ్యాన్స్, మ్యాజిక్, సర్కస్ విన్యాసాలు ఇలా ఏవేవో చేస్తుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి అలానే వచ్చాడు.

Anchor Suma Big Celebrity Challenge

Anchor Suma Big Celebrity Challenge

Anchor Suma : సుమకే లైన్ వేసేస్తున్నాడు..

అయితే ఆ వ్యక్తి మాత్రం సుమను చూసి తెగ సిగ్గు పడిపోయాడు. సుమ అంటే చాలా మెలికలు తిరిగిపోతోన్నాడు. సుమ కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ.. నాకు పెళ్లి కాలేదని అనుకుంటున్నాడేమో అందుకే ఇలా పులిహోర కలుపుతున్నాడంటూ అందరి ముందే అనేసింది. దీంతో అతనికి ఏం జరుగుతోందో అర్థం కాక అయోమయంలో పడ్డాడు. మొత్తానికి సుమకే లైన్ వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp