Anchor Suma : నోట్లో తప్పా అన్ని చోట్లా పెట్టావ్!.. ఛీ ఛీ యాంకర్ సుమ కూడా అంతేనా?

Authored By aruna | The Telugu News | Published on: August 17, 2022, 1:00 pm

Anchor Suma : యాంకర్ సుమ అంటే ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఎంతో ఇష్టంగా ఉండేది. ఎప్పుడూ కూడా అదుపు తప్పదని, పద్దతిగా ఉంటుందని, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదని అనుకుంటూ ఉండేవారు. అందుకే ఆమె షోలంటే అందరికీ అంత ఇష్టంగా ఉండేవి. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసేలా ఆ షోలు ఉండేవి. కానీ సుమ రాను రాను చాలా మారిపోతూ వస్తోంది. సుమ కూడా మూసధోరణిలోకి అడుగు పెట్టేస్తోంది. అందరిలానే పిచ్చి మాటలను మాట్లాడుతోంది.

బుల్లితెరపై షోలు అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్, వెకిలి చేష్టలుండాల్సిందే అన్నట్టుగా మారిపోయింది. ఇక ఇప్పుడు సుమ కూడా అలాంటి దారిలోనే నడుస్తోంది. సుమ కూడా దారుణంగా పచ్చి బూతులను మాట్లాడేస్తోంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చిపోతోంది. తాజాగా క్యాష్ షోకు సంబంధించిన ప్రోమోను వదిలారు. అందులో సుమ అందరి ముందే రెచ్చిపోయింది.

Anchor Suma Double Meaning Dailogue in Cash Show Promo

Anchor Suma Double Meaning Dailogue in Cash Show Promo

వాంటెడ్ పండుగాడ్ అనే టీం సుమ క్యాష్ షోకు వచ్చింది. ఆగస్ట్ 19న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా యూనిట్ అంటే అనసూయ రాఘవేంద్రరావు నిత్యా శెట్టి, యశ్వంత్ మాస్టర్ విష్ణుప్రియ వంటి వారంతా వచ్చారు. వీరితో కలిసి సుమ చాలానే ఫన్ క్రియేట్ చేసింది. అయితే అనసూయకు ఇచ్చిన ఓ స్కిట్ మాత్రం దారుణంగా బెడిసికొట్టేసింది. సుమ క్యాష్ షోలో ఆడే ఆటలు ఎలా ఉంటాయోఅందరికీ తెలిసిందే.

Anchor Suma : రెచ్చిపోయిన సుమ..

అనసూయ కళ్లకు గంతలు కట్టించింది. ఐస్ క్రీమ్ కరెక్ట్‌గా తనకు తినిపిస్తే ఆన్సర్ చెప్పాల్సిన పని లేదని అంది. అయితే అనసూయ కళ్లకు గంతలు ఉండటంతో.. సుమ మొహం మీద అటూ ఇటూ అంటూ ఐస్ క్రీం తిప్పింది. నోట్లో తప్పా అన్ని చోట్లా పెట్టావ్ అంటూ దారుణంగా సుమ అనేసింది. ఇలాంటి పిచ్చి డైలాగ్‌లు నీకు అవసరమా? అంటూ సుమ అభిమానులు హర్ట్ అవుతున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp