Suma Kanakala : మీరు పెద్ద యాంకర్ అయి ఉండొచ్చు కానీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.. లైవ్‌లో సుమకు మీడియా రిపోర్టర్స్ వార్నింగ్
ప్రధానాంశాలు:
యాంకర్ సుమకు మీడియా రిపోర్టర్స్ షాక్
స్నాక్స్ భోజనాల్లా చేశారు అన్నందుకు మీడియా సీరియస్
వెంటనే క్షమాపణ చెప్పిన సుమ
Suma Kanakala : యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులోనే సుమ టాప్ యాంకర్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి ఈవెంట్ జరిగినా తనే ముందుంటుంది. తను అంత ఈజీగా టాప్ యాంకర్ కాలేదు. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఈ స్థాయికి చేరుకుంది. తన భర్త రాజీవ్ కనకాల కూడా నటుడే. తాజాగా తన కొడుకును కూడా ఇదే ఇండస్ట్రీకి తీసుకొచ్చింది సుమ. తన కొడుకు కొత్త సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక.. తను ఇప్పటికీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా ఉన్న నేపథ్యంలో తను ఏది చెబితే అదే. స్టేజీ మీద ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అనేలా ఉంటుంది. ఒక్కోసారి పెద్ద హీరోల ముందు టంగ్ స్లిప్ అయి ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. తాజాగా యాంకర్ సుమ.. మరోసారి నోరు జారింది. ఆదికేశవ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మీడియా వాళ్ల మీద జోక్స్ వేయడంతో మీడియా వాళ్లు సీరియస్ అయ్యారు.
జనరల్ గా మీ యాంకరింగ్ అందరికీ ఇష్టం కానీ.. మీరు మీడియా వాళ్ల మీద ఇలాంటి పంచ్ లు వేయకండి. మమ్మల్ని వదిలేయండి.. వేరే వాళ్లను మీరు ఏదైనా అనుకోండి. మీరు చాలా ఎనర్జిటిక్ గా హోస్ట్ చేస్తారు. మీరు స్నాక్స్ భోజనాల్లా తిన్నారు అని మీడియా వాళ్లను అన్నారు. అలాంటిది ఇంకోసారి అనకండి అని మీడియా వాళ్లు సుమ మీద సీరియస్ అవుతారు. మీరు బాధపడితే సారీ అండి. మీరు స్నాక్స్ స్నాక్స్ లాగానే తిన్నారు అంటూ మళ్లీ పంచ్ వేస్తుంది సుమ. దీంతో అదే వద్దు.. అని మళ్లీ సుమపై సీరియస్ అవుతారు మీడియా వాళ్లు. మేము చాలా బాధపడ్డాం. మీరు జోక్ గానే వేసి ఉంటారు కానీ.. మాకు మాత్రం చాలా బాదేసింది అంటూ మీడియా వాళ్లు సీరియస్ అవ్వడంతో మీరు బాధపడితే సారీ అని చెబుతుంది సుమ.
Suma Kanakala : సుమ క్షమాపణ చెప్పడం కరెక్టేనా?
మామూలుగా సుమ హోస్ట్ చేసేటప్పుడు చాలామంది మీద జోక్స్ వేస్తుంది. ఆ జోక్స్ జోక్స్ లాగానే తీసుకోవాలి కానీ.. తను ఏదో అందరినీ నవ్వించడం కోసం అలా సరదాగా, ఫన్నీగా మాట్లాడుతుంది కానీ.. ఆమె ఏదో మాట్లాడిందని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అని నెటిజన్లు మీడియా రిపోర్టర్లపై మండిపడుతున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
https://www.youtube.com/watch?v=KS_vOrse3q4