Suma kanakala సుడిగాలి సుధీర్ ‘ కాలింగ్ సహస్ర ‘ సినిమాకి చీఫ్ గెస్ట్ గా సుమ కనకాల ..

Authored By aruna | The Telugu News | Published on: November 30, 2023, 5:00 pm
  •  Suma kanakala సుడిగాలి సుధీర్ ' కాలింగ్ సహస్ర ' సినిమాకి చీఫ్ గెస్ట్ గా సుమ కనకాల

  •  Suma kanakala emotional words about sudigali sudheer

  •  జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం వెండితెరపై వరుస సినిమాలు చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా వెండితెర మీద కనిపించారు.

Suma kanakala జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం వెండితెరపై వరుస సినిమాలు చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా వెండితెర మీద కనిపించారు. ఆ సినిమా సక్సెస్ కాకపోయినా తర్వాతి సినిమా ‘ గాలోడు ‘ మంచి హిట్ అయింది. దీంతో సుడిగాలి సుధీర్ సినిమాల స్పీడ్ పెంచారు. తాజాగా ఆయన ‘ కాలింగ్ సహస్ర ‘ అనే సినిమాలో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1 విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యాంకర్ మంజుష హోస్ట్ గా వ్యవహరించారు. ఇక చీఫ్ గెస్ట్ గా సుమ కనకాల హాజరయ్యారు. సుడిగాలి సుధీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుడిగాలి సుధీర్ చాలా హార్డ్ వర్క్ చేస్తారని, ఆయన సినిమాలను అభిమానులు చాలా ప్రోత్సహిస్తారని, గాలోడు సినిమా ఆల్రెడీ పెద్ద హిట్ అయింది. ఇలాగే ఇంకా ఇంకా సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానని, టెలివిజన్ నుంచి ఫిలిం ఇండస్ట్రీ లోకి వచ్చిన వారిలో అందరూ గుర్తు పెట్టుకునే వ్యక్తి షారుక్ ఖాన్. సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన షారుఖ్ ఖాన్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అయ్యారు.

ఇక సుడిగాలి సుధీర్ కూడా అలానే సూపర్ స్టార్ అవ్వాలి, తను చాలా కష్టపడతాడు. ఈ కష్టం, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఇలానే ఉండాలని, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని సుమ కనకాల చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమాను అరుణ్ విక్కిరాల దర్శకత్వ వహించారు. డాలీషా హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. షాడో మీడియా ప్రొడక్షన్స్ రాధా ఆర్ట్స్ పథకాలపై విజయ్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి సినిమాను నిర్మించారు. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని సుడిగాలి సుధీర్ అభిమానులు కోరుకుంటున్నారు.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp