Anchor Suma : యాంకర్ సుమ నుండి దాన్ని కోరుకుంటున్న బుల్లితెర అభిమానులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Suma : యాంకర్ సుమ నుండి దాన్ని కోరుకుంటున్న బుల్లితెర అభిమానులు

Anchor Suma : బుల్లి తెరపై యాంకర్ గా దాదాపు రెండు దశాబ్దాలుగా అలరిస్తున్న యాంకర్ సుమ ఎన్నో గేమ్ షో లతో బుల్లి తెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అందరూ హీరోల సినిమాల యొక్క ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్ ని సుమ సక్సెస్ చేయడంలో కీలక పాత్ర వహిస్తారు. సుమ యాంకర్ గా వ్యవహరిస్తుంది అంటే ఆ షో కానీ కార్యక్రమం కానీ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :20 December 2022,7:00 pm

Anchor Suma : బుల్లి తెరపై యాంకర్ గా దాదాపు రెండు దశాబ్దాలుగా అలరిస్తున్న యాంకర్ సుమ ఎన్నో గేమ్ షో లతో బుల్లి తెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అందరూ హీరోల సినిమాల యొక్క ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్ ని సుమ సక్సెస్ చేయడంలో కీలక పాత్ర వహిస్తారు. సుమ యాంకర్ గా వ్యవహరిస్తుంది అంటే ఆ షో కానీ కార్యక్రమం కానీ సూపర్ హిట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న క్యాష్ కార్యక్రమం ఎంతటి సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె నుండి అంతా కూడా ఒక టాక్ షో ని ఆశిస్తున్నారు.

సుమ గతంలో ఎంతో మంది స్టార్స్ ని ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఇంటర్వ్యూలు కాకుండా ఒక టాక్‌ షో చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా టాక్‌ షో ముగిసిన విషయం తెలిసిందే. చివరి ఎపిసోడ్ లో ఆలీని సుమ ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంగా సుమ అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే సుమ నుండి టాక్ షో కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆలీతో సరదాగా కి బదులుగా సుమ తో సరదాగా అనే టాక్‌ షో వస్తే బాగుంటుందని ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆశిస్తున్నారు. సుమ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది.

Anchor Suma fans want a talk show from her

Anchor Suma fans want a talk show from her

అయినా కూడా ఆమెను టాక్‌ షో చేసేందుకు తీసుకొస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీలో కాకుండా మరేదైనా షోలో ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాల యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ మరియు ఇతర కార్యక్రమాలకు సుమ ఎలాగూ యాంకర్ గా వ్యవహరిస్తుంది. అదే సమయంలో ఒక టాక్ షో కి యాంకర్ కి వ్యవహరిస్తే ఆమె స్థాయి మరింతగా పెరుగుతుందని అభిమానులతో పాటు బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి సుమ అభిప్రాయం ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది