Anchor Suma : సుమకు ఘోర అవమానం!.. షోలో ఒక్కసారిగా అలా జరగడంతో షాక్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Anchor Suma : సుమకు ఘోర అవమానం!.. షోలో ఒక్కసారిగా అలా జరగడంతో షాక్

Anchor Suma యాంకర్ సుమ Anchor Suma  బుల్లితెరపై చేసే అల్లరి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ షోల్లో సుమ చేసే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. తన షోలకు ఏ వయసు వారు వచ్చినా సరే అదే స్టైల్లో సుమ ఆడుకుంటుంది. సీనియర్లు జూనియర్లు చిన్నా పెద్దా అనే తేడా ఏమీ ఉండదు. అక్కడ సుమ ఉందంటే చాలు. పంచుల వర్షం కురవాల్సిందే. ప్రాసల దాడి జరగాల్సిందే. నవ్వుల మోత మోగాల్సిందే.అలా తాజాగా సుమ […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :12 September 2021,4:00 pm

Anchor Suma యాంకర్ సుమ Anchor Suma  బుల్లితెరపై చేసే అల్లరి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ షోల్లో సుమ చేసే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. తన షోలకు ఏ వయసు వారు వచ్చినా సరే అదే స్టైల్లో సుమ ఆడుకుంటుంది. సీనియర్లు జూనియర్లు చిన్నా పెద్దా అనే తేడా ఏమీ ఉండదు. అక్కడ సుమ ఉందంటే చాలు. పంచుల వర్షం కురవాల్సిందే. ప్రాసల దాడి జరగాల్సిందే. నవ్వుల మోత మోగాల్సిందే.అలా తాజాగా సుమ అందరినీ దడదడలాడించింది.

Anchor Suma Fun With Dance Masters In Cash

Anchor Suma Fun With Dance Masters In Cash

క్యాష్ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ షోలో డ్యాన్స్ మాస్టర్లు వచ్చారు. శివ శంకర్, అమ్మ రాజ శేఖర్, తరుణ్ మాస్టర్, పాపీ మాస్టర్ ఇలా అందరూ వచ్చి సందడి చేశారు. ఇక ఇందులో సీనియర్‌లు అయిన తరుణ్ మాస్టర్, శివ శంకర్ మాస్టర్‌ను అందరూ ఆడుకున్నారు. ఇక సుమ అయితే వారి వయసు, ఫిట్ నెస్ మీద కౌంటర్లు వేశారు. కిందకు వంగి చేత్తో వారి వారి కాలి బొటన వేలును పట్టుకోవాలని చెప్పింది.

 

Anchor Suma Fun With Dance Masters In Cash

Anchor Suma Fun With Dance Masters In Cash

సుమకు ఘోర అవమానం!.. షోలో ఒక్కసారిగా అలా జరగడంతో షాక్ Anchor Suma

అయితే అది శివ శంకర్, తరుణ్ మాస్టర్ల వల్ల కాదని అమ్మ రాజశేఖర్ కౌంటర్ వేశాడు. తరుణ్ మాస్టర్ ట్రై చేశాడు కానీ కుదర్లేదు. ఇక చివరకు అందరూ కలిసి సుమనే టార్గెట్ చేశారు. ఇక సుమ కూడా ప్రయత్నం చేసింది. కిందకు వంగి తన కాలి బొటన వేలును పట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ అంతలోపే కిందకు పడిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. వినాయక చవితి అని పిలిచి నన్ను ఇలా చేస్తారా? అంటూ సుమ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Anchor Suma Fun With Dance Masters In Cash

Anchor Suma Fun With Dance Masters In Cash

 

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది