Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు ఇంటి నుంచి సరయు అవుట్.. కారణాలు ఇవేనా?
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో నుంచి ఓ వ్యక్తి బయటకు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. మొదటి వారం విజయవంతంగా గడిచింది. ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. యాంకర్ రవి, మానస్, హమీద, సరయు, కాజల్, జెస్సీలు మొదటి వారంలో నామినేట్ అయ్యారు. ఇందులో భాగంగా శనివారం నాటి ఎపిసోడ్‌లో యాంకర్ రవి, హమీద సేఫ్ అయినట్టు ప్రకటించేశారు. ఇక నేటి ఆదివారం నాటి ఎపిసోడ్‌లో అసలు సంగతి బయటకు రానుంది. […]
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో నుంచి ఓ వ్యక్తి బయటకు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. మొదటి వారం విజయవంతంగా గడిచింది. ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. యాంకర్ రవి, మానస్, హమీద, సరయు, కాజల్, జెస్సీలు మొదటి వారంలో నామినేట్ అయ్యారు. ఇందులో భాగంగా శనివారం నాటి ఎపిసోడ్‌లో యాంకర్ రవి, హమీద సేఫ్ అయినట్టు ప్రకటించేశారు. ఇక నేటి ఆదివారం నాటి ఎపిసోడ్‌లో అసలు సంగతి బయటకు రానుంది. కానీ ఇంతలోపే లీకులు తెగ హల్చల్ చేశాయి.
బిగ్ బాస్ 5 తెలుగు ఇంటి నుంచి సరయు అవుట్.. కారణాలు ఇవేనా? Bigg Boss 5 Telugu
సరయు ఎలిమినేట్ అయిందంటూ లీకులు బయటకు వచ్చాయి. కానీ ఇది అందరికీ ఓ షాక్ వంటిదే. అందరూ కూడా జెస్సీ ఎలిమినేట్ అవుతాడని భావించారు. కానీ చివర్లో సింపతీ ఓట్లు బాగానే పడ్డట్టున్నాయి. అందరూ కలిసి కార్నర్ చేయడం, చిన్నపిల్లాడు అని చెప్పి అందరూ ఏదో ఒక విషయంలో మాటలు అనేయడం వంటి వాటితో జనాల్లో సింపతీ పెరిగిపోయింది. ఇదే క్రమంలో సరయుకు దెబ్బ పడింది. అయితే ఆమె ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
జెస్సీ లేదా? హమీదాలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సరయు ఎలిమినేట్ అయింది. అయితే ఇందులో చాలా కారణాలున్నాయి. సరయు వచ్చిన నేపథ్యం, బయట ఆమెకు ఉన్న బ్యాడ్ ఇమేజ్ వల్లే ఓట్లు పడి ఉండకపోవచ్చు. ఈ వారంలోనూ ఆమె తన మార్క్‌ను కూడా చూపించలేకపోయింది. అనవసరపు కారణాలను చూపిస్తూ ఇతర కంటెస్టెంట్లతో గొడవలకు దిగింది తప్పా.. ఎక్కడా యాక్టివ్‌గా కనిపించలేదు. దీంతో ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదని తెలుస్తోంది. అందుకే ఓట్లు తక్కువగా వచ్చినట్టున్నాయ్. అలా చివరకు ఎలిమినేట్ అయి బయటకు వచ్చిందని తెలుస్తోంది.
Sarayu Gets Elimintaed From Bigg Boss 5 Telugu