Anchor suma gives surprises to fans
Anchor Suma : యాంకర్ సుమ.. తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈవిడ షో మొదలు పెట్టిందంటే టీఆర్పీలు దద్దరిల్లాల్సిందే. సుమ షోస్‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. యాంకర్ సుమ సోషల్ మీడియాలో తన అమ్మ గురించి అప్పుడప్పు చెబుతూ ఉంటారు. ఆమెతో కలిసి ఫన్నీ వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు. తన అమ్మ ఇప్పటికీ వ్యాయామాలు, యోగాలు చేస్తుందని, ఎంతో యాక్టివ్‌గా ఉంటారని సుమ ఆ మధ్య ఓ వీడియోను షేర్ చేశారు. అందులో సుమ అమ్మ గారి ఎనర్జీకి అందరూ ఫిదా అయ్యారు. ఇక తాజాగా సుమ తెనాలి డబుల్ హార్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ వీడియో షేర్ చేసింది.
ఇందులోభాగంగా సుమ తాను ఒక యాంకర్ ని మాత్రమే కాదు యాంకర్, ప్రోడ్యూసర్, తల్లిని అని చెబుతూ తల్లి చేతులలో ఎంత మ్యాజిక్ ఉంటుందో తెలియజేసింది. తెనాలి డబుల్ హార్స్ గుడీస్ నుండి మంచి గిఫ్ట్స్ అందుకోవాలి అంటే ఓ వీడియో కాని ఫోటోస్ కాని అప్ లోడ్ చేయాలని కోరింది. ఇందుకు సంబంధించి పలు విషయాలు కూడా చెప్పుకొచ్చింది సుమ. ఈ అమ్మడు చెప్పిన స్టన్నింగ్ విషయాలకి ప్రేక్షకులు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం సుమ షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.యాంకర్ సుమ.. ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. గత రెండు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్‌లో తనకి తానే సాటి, ఎవరు లేరు పోటీ అన్నట్టుగా దూసుకుపోతుంది.
Anchor suma gives surprises to fans
యాంకర్ సుమ తన స్పాంటన్యుటితో అంచెలంచెలుగా ఎదిగింది. తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకుంది. కొత్త గా ఏ షో స్టార్టైయినా ముందుగా తన పేరును పరిశీలించిగానే ప్రారంభించరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పటి వరకు తెలుగు టెలివిజన్ కార్య క్రమాలు, గేమ్ షోలకు పరిమితమైన సుమ ఉన్నట్టుండి కొత్త అవతారం ఎత్తారు. ఇప్పుడు జయమ్మ పంచాయతీ సినిమా కోసం నటి అవతారం కూడా ఎత్తింది. విజయ్ కుమార్ కలివరపు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎంఎం కీరవాణి మంచి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.