Anchor Suma : అందుకే మీరు గ్రేట్.. ఆ ఇద్దరికీ దండం పెట్టేసిన యాంకర్ సుమ
Anchor Suma : యాంకర్ సుమ అంటే అందరికీ ఇష్టమే. ఆమె వేసే పంచ్‌లు, సమయస్ఫూర్తితో కవర్ చేసే డైలాగ్స్, వాక్దాటి అన్నీ కూడా తెలుగు ప్రేక్షకులకు తెలుసు. తాజాగా ఆమె తన షోలో కమెడియన్లు చేసిన కామెడీ, వారి వారి రోగాల మీద చేసిన సెటైర్ల మీద సుమ స్పందించింది. నూకరాజు, పంచ్ ప్రసాద్‌ల గురించి అందరికీ తెలిసిందే. ఆ ఇద్దరూ షుగర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే.జబర్దస్త్ షోలో పంచ్ ప్రసాద్ ఎంతలా ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. మధ్యలో జబర్దస్త్ షోకు దూరంగా ఉండిపోయాడు.
కిడ్నీ వ్యాధితో బాధపడుతుండటంతో మధ్యలో షోకు దూరంగా ఉండిపోయాడు. జబర్దస్త్ ఫ్యామిలీ అంతా కలిసి పంచ్ ప్రసాద్‌కు అండగా ఉంటూ వచ్చారు. ఆపరేషన్‌కు సరిపడా డబ్బులు ఇచ్చారు. అయితే ఆ డబ్బంతా కూడా నాగబాబు దగ్గరున్నాయి.ఇక నూకరాజు అయితే తనకున్న షుగర్ వ్యాధి గురించి ప్రతీ స్కిట్లో సెటైర్లు వేస్తుంటారు. ఈ మధ్య అయితే తన వ్యాధి మీద ఎక్కువగా కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి సుమ క్యాష్ షోలోనూ తమ వ్యాధిపైనా కౌంటర్లు వేసుకున్నారు.

Anchor Suma Praises On Punch Prasad And Nooka Raju In Cash Show
పేరడీ పాటలను పాడుకుంటూ అదసలు రోగమే కాదన్నట్టుగా సెటైర్లు వేసుకున్నారు. మొత్తానికి వారి ధైర్యానికి సుమ ఫిదా అయింది.ఇలాంటి వ్యాధి ఉన్నా కూడా మీరు వాటిని కామెడీ తీసుకుని, ఇంత స్పోర్టీవ్‌గా ఉంటున్నారు..మీరు ఎంతో మందికి స్పూర్తి అంటూ సుమ దండం పెట్టేసింది. మొత్తానికి నూకరాజు, పంచ్ ప్రసాద్‌లు మాత్రం వారి వారి వ్యాధులను సైతం బలంగా మార్చేసుకుంటున్నారు.
