Anchor Suma : అలాంటివి చేయడం ఆయనకు నచ్చవు.. భర్తపై యాంకర్ సుమ కామెంట్స్
Anchor Suma యాంకర్ సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తుంటుంది. కానీ సినిమాలు మాత్రం చూసేంత వీలు ఉండదు. అంత ఖాళీ సమయం సుమ డైరీలో ఉండకపోవచ్చు. కానీ తాజాగా సుమ లవ్ స్టోరీ సినిమాను వీక్షించినట్టు కనిపిస్తోంది. చాలా రోజుల తరువాత తన భర్త రాజీవ్ కనకాల ఈ చిత్రంలో అదిరిపోయే పాత్రను పోషించాడు. అందుకే సుమ కూడా లవ్ స్టోరీ మీద బాగానే ఇంట్రెస్ట్ చూపించినట్టు తెలుస్తోంది.
తాజాగా సుమ తన స్టైల్లో లవ్ స్టోరీ రివ్యూ చెప్పేసింది. తమ నటనతో మనల్ని తమలో లీనం చేసుకోగల నటులు కొంత మందే ఉంటారని, అందులో మా ఆయన కూడా ఒకరు అని భర్త్ మీద ప్రశంసలు కురిపించింది. నా హబ్బీ రాజీవ్ కనకాల అంటూ మెన్షన్ చేసేసింది సుమ. అద్బుతమైన రోల్ పోషించినందుకు కంగ్రాట్స్ అంటూ భర్తకు విషెస్ చెప్పేసింది.
లవ్ స్టోరీపై సుమ రివ్యూ.. Anchor Suma
ఆ పాత్ర చేసినందుకు నువ్వెంత చెడుగా ఫీల్ అయ్యావో నాకు తెలుసు.. నీకు నచ్చదని తెలుసు. కానీ ఆ పాత్రతో ఎంతో మంది మీద ప్రభావాన్ని చూపించావ్. అలాంటి సున్నితమైన అంశాలను, మరింత సున్నితంగా చూపించిన శేఖర్ కమ్ములకు థ్యాంక్స్. నాగ చైతన్యకు హార్టీ కంగ్రాట్స్. సాయి పల్లవి డ్యాన్స్ చూసి నా కళ్లు నొప్పి పుట్టేశాయి. కన్ను కూడా ఆర్పకుండా చూసేశాను. టీం మొత్తానికి కంగ్రాట్స్ అని సుమ చెప్పేసింది.