Rajeev Kanakala : జూ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టేది ఎప్పుడంటే ..??
ప్రధానాంశాలు:
Rajeev Kanakala : జూ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టేది ఎప్పుడంటే ..??
Rajeev Kanakala : జూనియర్ ఎన్టీఆర్ రాజీవ్ కనకాల దాదాపుగా ఒకేసారి సినీ కెరియర్ ను మొదలుపెట్టారు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా వీరిద్దరికి బ్రేక్ ఇచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాలో రాజీవ్ కనకాల కూడా నటిస్తుంటారు. సినిమాల పరంగానే కాకుండా బయట కూడా ఎన్టీఆర్ , రాజీవ్ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల పాల్గొన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం ప్రచారం చేశాడు. తన స్పీచ్ తో అందరిని ఉర్రూతలూగించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండవచ్చు కానీ ఐదేళ్ల తర్వాత ఎన్టీఆర్ వచ్చే అవకాశం ఉండవచ్చు. అప్పుడు మాత్రం రాజకీయం పూర్తిగా నేర్చుకుని పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు. అయితే అతని మౌనం విషయంలో కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్ చేస్తున్నారా లేదా నిజంగానే నెగిటివిటీ వస్తుందా అనేది తెలియడం లేదు అని అన్నారు.
జూ ఎన్టీఆర్ కు నటన అంటే చాలా ఇష్టం అని, కరోనా, ఆర్ఆర్ఆర్ వల్ల తన కెరీర్ లో నాలుగేళ్లు పైగా టైం అయిపోయింది. ఆ గ్యాప్ లో తను మరో మూడు సినిమాలు చేసేవాడు. ఇప్పుడు దేవరని కంప్లీట్ చేసే బిజీలో ఉన్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంత సినిమాలపైనే ఉంది. వాటితో బిజీగా ఉండడం వలన రాజకీయాల గురించి స్పందించడం లేదని అనుకుంటున్నాను. ఈ విషయం గురించి నా దగ్గర తను మాట్లాడలేదు కానీ ఎన్టీఆర్ రాజకీయాలకు రావాలని అనుకున్నప్పుడు కచ్చితంగా వస్తాడు అని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. అరెస్టును ఖండించి చంద్రబాబునాయుడు కి మద్దతు తెలిపారు. తమిళ హీరో రజనీకాంత్, విశాల్ కూడా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ రియాక్ట్ అయ్యారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ దీనిపై స్పందించలేదు. దీంతో ఎన్టీఆర్ తీరుపై పలువురు టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు. అయినా ఎన్టీఆర్ మౌనం వహిస్తూనే వచ్చాడు. ఇక ఎన్టీఆర్ మౌనం వెనుక ఉన్న కారణాలకు పలు కారణాలు చెబుతూ అభిమానులు కామెంట్స్ చేస్తూ వచ్చారు. సినిమాలో బిజీగా ఉండటం వలన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి స్పందించలేదని చెప్పుకొచ్చారు. అయినా గతంలో జూనియర్ ఎన్టీఆర్ మా తాత పెట్టిన పార్టీ ఎప్పుడైనా వస్తానని చెప్పాడో కాబట్టి కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి అడుగుపెడతాడు ఇప్పుడు సినిమాల పరంగా చాలా బిజీగా ఉన్నాడు అందుకే పాలిటిక్స్ పై ఆసక్తి చూపడం లేదని అంటున్నారు.