Anchor Suma : ఓనమ్ స్పెషల్.. అమ్మతో కలిసి సుమ సందడి

Authored By aruna | The Telugu News | Updated on : 9 September 2022, 4:00 pm

Anchor Suma : యాంకర్ సుమ నెట్టింట్లో ఎప్పుడూ సందడిగా సరదాగా ఉంటుంది. ఆమె చేసే అల్లరిని అందరూ ఇష్టపడుతుంటారు. బుల్లితెర అయినా అది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా.. యూట్యూబ్‌లో చేసే వీడియోలు అయినా.. నెట్టింట్లో వేసే పోస్టులైనా కూడా సుమ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటుంది. ఎప్పుడూ చలాకీగా ఉంటూ అభిమానులను అలరిస్తుంటుంది. అలాంటి సుమ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఈ మధ్య సుమ ఎక్కువగా ఏ వీడియో చేసినా కూడా అందులో తన అమ్మను చూపిస్తుంటుంది. ఆ మధ్య వరలక్ష్మీ వ్రతం కోసం చీర షాపింగ్ అంటూ సందడి చేసింది.

అందులోనూ తన అమ్మను షాపింగ్‌కు తీసుకెళ్లింది. తన అమ్మ 80వ పుట్టిన రోజు, వరలక్ష్మీ వ్రతం చీరఅంటూ సుమ షాపింగ్ చేసింది. అందులో తన అమ్మ గురించి, తన అమ్మ ఆడే బేరాల గురించి ఎన్నో సెటైర్లు వేసింది. ఇక తన అమ్మ 80వ పుట్టిన రోజు సుమ గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. అపార్ట్మెంట్‌లోని అందరినీ పిలిచినట్టుంది.తన అమ్మ ఫ్రెండ్స్‌ను కూడా ప్రత్యేకంగా పిలిచినట్టుంది. ఈ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల సుమ ఇద్దరూ ఎంతో చూడముచ్చటగా కనిపించారు. ఇక తాజాగా సుమ ఓ వీడియోను షేర్ చేసింది.

Anchor Suma With Her Mother on Onam Special

Anchor Suma With Her Mother on Onam Special

అందులో తన ప్రత్యేక పండుగకు సంబంధించిన సెలెబ్రేషన్స్‌ను చూపించింది. కేరళకు ఓనమ్ అనే పండుగ ఎంత ప్రత్యేకమైందో అందరికీ తెలిసిందే. మన తెలుగు వాళ్లకు ఉగాది, సంక్రాంతి ఎంత స్పెషల్‌ అని అనుకుంటామో.. కేరళ వాళ్లకు ఓనమ్ తొలి పండుగ. ఇక కేరళ సంప్రదాయం ఉట్టిపడేలా ఓనమ్ పండుగను తన అమ్మతో కలిసి సుమ సెలెబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేసింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి