Anchor Varshini : అలాంటి వాళ్లు ఇంట్లో ఇలాంటి పనులు చేస్తారా?.. యాంకర్ వర్షిణి కూడా అలాంటిదేనా?
Anchor Varshini : యాంకర్ వర్షిణి బుల్లితెరపై, సోషల్ మీడియాలో ఎంత సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఢీ షోలో వర్షిణి చేసిన సందర్భంగా నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యేది. హైపర్ ఆదితో లవ్ ట్రాక్ అంటూ యూట్యూబ్‌లో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఒకానొక దశలో ఈ ఇద్దరిపెళ్లి వార్తలు పీక్స్‌లోకివెళ్లాయి. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని, అంతకు మించి ఏమీ లేదని ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ వర్షిణి, ఆదిల మీద ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. మొన్నటికి మొన్న వర్షిణి చేసిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆది బర్త్ డే నాడు వర్షిణి వేసిన పోస్ట్ షాకింగ్‌గా అనిపించింది. ఆది మీద ఎంత ప్రేమ ఉందో చెప్పేలా ఆ పోస్ట్ వేసింది. ఆదితో కలిసి ఎంతో సన్నిహితంగా ఉంటుందో చెప్పకనే చెప్పేసింది. ఇక జీవితాంతం నీ తోడు కావాలని పరోక్షంగా ప్రేమ గురించి చెప్పినట్టు అనిపించింది. మొత్తానికి వర్షిణి ఆది లవ్ స్టోరీ మరోసారి అలా బయటకు వచ్చింది. ఒక్కసారిగా ట్రెండింగ్ అయింది. అయితే వర్షిణి ఇప్పుడు బుల్లితెరకు దూరంగా ఉంటోంది. యాంకర్ వర్షిణి ఎక్కువగా సినిమాల మీద ఫోకస్ పెట్టేసినట్టు అనిపిస్తోంది. అందుకే బుల్లితెరకు దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. అసలే ఆమె సుమంత్, సమంత వంటి వారితో కలిసి నటించింది.

Anchor Varshini Sounderajan ABout Introvert
వెబ్ సిరీస్‌లు కూడా ప్లాన్ చేస్తోన్నట్టు తెలుస్తోంది. అయితే సుమంత్ హీరోగా వచ్చిన మళ్లీ మొదలైంది చిత్రంలో వర్షిణి నటించింది. కానీ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక వర్షిణి ఆశలన్నీ కూడా సమంత శాకుంతలం మీదే ఉంది. మరి ఈ చిత్రం ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియడం లేదు. అదలా ఉంచితే తాజాగా వర్షిణి ఓ పోస్ట్ వేసింది. ఇంట్రోవర్ట్‌లు ఇంట్లో ఎలా ఉంటారో చూపించింది వర్షిణి. పిచ్చి పిచ్చిగా గెంతులు వస్తూ హాయిగా, స్వేచ్చగా ఓపెన్ అవుతారని చెప్పింది. అంటే తాను కూడా అలానే ఉంటానని పరోక్షంగా చెప్పినట్టు అనిపించింది.