Vishnu Priya : తాను కూడా అలానే చేశానని చెబుతోంది.. అంతా వ్యర్థమంటోన్న విష్ణు ప్రియ
Vishnu Priya : యాంకర్ విష్ణు ప్రియ ఎంత సరదగా ఉంటుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో అయితే ఎంతో ఫన్నీగా ఉంటుంది. నవ్వులు తెప్పించే వీడియోలను షేర్ చేస్తుంటుంది. తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది. గత కొన్ని రోజులుగా తన ఎద అందాలను విచ్చల విడిగా ప్రదర్శిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. ఆ అందాల ఆరబోతకు ఒక్క సారిగా ఫాలోవర్లు కుప్పలు తెప్పలుగా పెరిగాయి. దెబ్బకు వన్ మిలియన్ ఫాలోవర్లు వచ్చి పడ్డారు.అలా విష్ణుప్రియ అందాల జాతర అందరినీ కదిలించింది. అలా విష్ణుప్రియ చేస్తోన్న హాట్ ఫోటో షూట్లతో నెట్టింట్లో మంటలు పుట్టేశాయి. ఆమె ఎద అందాల ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.
మొత్తానికి విష్ణుప్రియ మాత్రం అందాల విందు చేస్తూ అందరినీ ఫిదా చేస్తోంది. మామూలుగా అయితే విష్ణుప్రియ వర్కవుట్ వీడియోలు, బుల్లి నిక్కర్లు వేసుకుని వేసే స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. అలాంటి విష్ణుప్రియ ఒక్కసారిగా హాట్ ఫోటోషూట్లతో విరుచుకపడింది. వరుసగా పోస్టులు చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేసేసింది. విష్ణుప్రియ బుల్లితెరపై కనిపించక చాలా రోజులే అవుతోంది. మామూలుగా అయితే శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కూడా కనిపించడం లేదు. విష్ణుప్రియ ఎక్కువగా ఫిట్ నెస్ మీదే ఫోకస్ పెట్టేసింది.

Vishnupriya says that she wasted 6 months already for this year
సినిమా కోసమే విష్ణుప్రియ ఇంతలా కష్టపడుతోందా? అనేట్టుగా ఉంది. అయితే తాజాగా విష్ణుప్రియ ఓ ఫన్నీ రీల్ వీడియోను షేర్ చేసింది. పద్మావతి సినిమాకు సంబంధించి రణ్ వీర్ సింగ్ వేసే పిచ్చి స్టెప్పులను ఎడిట్ చేసిన వీడియోను విష్ణుప్రియ షేర్ చేసింది. అందులో రణ్‌వీర్ సింగ్ పిచ్చి పిచ్చిగా గెంతులు వస్తూ ఉంటాడు. ఈ ఏడాదిలో ఆర్నెళ్లు ఆల్రెడీ వృథా చేశామని చెబుతూ అలా ఎగురుతున్నారట. నేను కూడా అలానే చేశానంటూ విష్ణుప్రియ కూడా పగలబడి నవ్వేసింది. మరి నిజంగానే ఈ ఆరు నెలలు వృథా చేసి ఉంటుందా? అని అందరూ అనుకుంటున్నారు.