Vishnu Priya : సంక్రాంతికి ఊరికి వెళ్లకుండా.. జబర్దస్త్ కమెడియన్ తో విష్ణుప్రియ ఎక్కడ ఎంజాయ్ చేస్తుందో తెలుసా… వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 14, 2023, 11:00 am

Vishnu Priya : అసలే సంక్రాంతి పండుగ. ఈ సమయంలో అందరూ తమ ఊళ్లకు వెళ్తారు. అక్కడ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. కానీ.. యాంకర్ విష్ణుప్రియ మాత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా తన ఇంటికి వెళ్లకుండా వెకేషన్ కు విదేశాలకు చెక్కేసింది. అవును.. తను ప్రస్తుతం ఒక యాంకర్ మాత్రమే కాదు.. హీరోయిన్ గానూ పలు సినిమాల్లో నటించింది. దీంతో తనకు అభిమానులు కూడా పెరిగారు. ఇటీవల వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో విష్ణుప్రియ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే..

తనకు సినిమాలు, టీవీ షోల కంటే కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగే.. తనకు ఇంత క్రేజ్ వచ్చేలా చేసింది. అందుకే తను సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటుంది. సోషల్ మీడియాలో తను పెట్టే ఫోటోలు చూస్తే అదే అనిపిస్తుంది. తను పెట్టే ఫోటోలు, వీడియోలు మామూలుగా ఉండవు. బీభత్సంగా గ్లామర్ ఫోటోలు పెట్టి జనాలను రెచ్చగొడుతుంది విష్ణుప్రియ. ప్రస్తుతం విష్ణుప్రియ మలేషియాలో ఉంది. అక్కడ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్రెండ్, జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరితో కలిసి తను మలేషియా చెక్కేసింది.

anchor vishnu priya enjoys her vacation in malaysia

anchor vishnu priya enjoys her vacation in malaysia

Vishnu Priya : మలేషియాలో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న విష్ణుప్రియ

ఇద్దరూ కలిసి మలేషియాలో తెగ ఎంజాయ్ చేశారు. కేవలం న్యూ ఇయర్ వేడుకల కోసం వాళ్లు మలేషియా వెళ్లారా? లేక సంక్రాంతి వరకు అక్కడే ఉండి ఎంజాయ్ చేస్తున్నారా అనేది తెలియదు కానీ.. విష్ణుప్రియ మాత్రం తన అందాలను ఆరబోసింది. రచ్చ రచ్చ చేసింది. దీంతో తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే విష్ణుప్రియ ఓ కవర్ సాంగ్ లోనూ నటించింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ తో కలిసి స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఆ పాట చాలా ఫేమస్ అయింది. విష్ణుప్రియకు మంచి పేరు కూడా వచ్చింది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp