Andrea jeremiah : నగ్నంగా నటించిన తమిళ స్టార్ హీరోయిన్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Andrea jeremiah : నగ్నంగా నటించిన తమిళ స్టార్ హీరోయిన్..

Andrea jeremiah : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా, పాపులర్ సింగర్ గా సౌత్ మొత్తం అందరికీ పరిచయస్తురాలే ఆండ్రియా. అయితే భాష ఏదైనా ఒక హీరోయిన్ కెమెరా ముందుకు వచ్చి నగ్నంగా నటించడం అంటే అదో ఛాలెంజ్. కానీ కొంతమంది హీరోయిన్స్ కథలో అవసరమైన సీన్స్ ఉంటే ఎలా నటించడానికైనా ఓకే అంటారు. ఒకప్పుడు రాశి లాంటి వారు కూడా ఇలా నగ్న సన్నివేశాలలో నటించిన వాళ్ళే. ఇక ఇటీవలే అమలా పాల్ కూడా ఆమె […]

 Authored By govind | The Telugu News | Updated on :14 June 2021,3:55 pm

Andrea jeremiah : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా, పాపులర్ సింగర్ గా సౌత్ మొత్తం అందరికీ పరిచయస్తురాలే ఆండ్రియా. అయితే భాష ఏదైనా ఒక హీరోయిన్ కెమెరా ముందుకు వచ్చి నగ్నంగా నటించడం అంటే అదో ఛాలెంజ్. కానీ కొంతమంది హీరోయిన్స్ కథలో అవసరమైన సీన్స్ ఉంటే ఎలా
నటించడానికైనా ఓకే అంటారు. ఒకప్పుడు రాశి లాంటి వారు కూడా ఇలా నగ్న సన్నివేశాలలో నటించిన వాళ్ళే. ఇక ఇటీవలే అమలా పాల్ కూడా ఆమె అనే సినిమాలో సీన్స్ అవసరం మేరకు నగ్నంగా  నటించింది. టీజర్, ట్రైలర్, పోస్టర్స్ లో అమలా పాల్ నగ్న లుక్స్ చూసి అందరూ షాకయ్యారు. కానీ ఆ
తర్వాత సినిమా చూసి అందరూ ప్రశంసించారు. ఇలాంటి రోల్ మరో హీరోయిన్ కూడా చేసిందని చెప్పుకుంటున్నారు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిష్కిన్ తెరకెక్కించగా 2016లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది ‘పిశాసు’. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వల్‌గా‌ ‘పిశాసు-2’ తెరకెక్కుతోంది. అయితే కథ పరంగా కొన్ని సీన్స్ లో డిమాండ్ ఉన్న కారణంగా ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం ఆండ్రియా నగ్నంగా నటించినట్టు కోలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ సీన్ తీసినప్పుడు చిత్ర యూనిట్ లో కొద్ది మంది మాత్రమే ఉన్నారట. వారి మధ్య ఈ సీన్ చిత్రీకరించినట్టు తెలుస్తోంది.

andrea jeremiah acting pisachi 2 movie

andrea jeremiah acting pisachi 2 movie

Andrea jeremiah : ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఇప్పుడు కోలీవుడ్‌లో దీనికి సంబంధించిన చర్చలు ఆసక్తికరంగా సాగుతున్నాయట. పూర్ణ, రాజ్‌కుమార్‌, పిచ్చుమణిలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కార్తీక్‌ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇంతక ముందే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. లాక్ డౌన్ పరిస్థితులన్ని చక్కబడి థియేటర్స్ ఓపెన్ అవగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. లేదంటే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది