Anee Master : బిగ్ బాస్ హౌజ్‌లో తాను ఎలాంటి బాధలు పడిందో చెప్పిన అనీ మాస్టర్..!
Anee Master: బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో పాల్గొన్న కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ హౌజ్ నుండి బయటకు వచ్చాక తెగ వార్తలలో నిలుస్తూ వస్తుంది. ఈవిడ ప్రస్తుతం మహేష్ కూతురు సితారకు కొరియోగ్రఫీ అందిస్తూ అప్పుడప్పుడు అందుకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఇటీవల కరోనా నుండి కోలుకున్న అనీ మాస్టర్ తాజాగా తాను హౌజ్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో తెలియజేసింది. పది వారాల పాటు ఆనీ మాస్టర్ బిగ్ బాస్ ఇంట్లో ఉంది. సన్నీ, మానస్, కాజల్‌కు వ్యతిరేకంగా ఎన్నో సార్లు ఆనీ మాస్టర్ గొడవలు పెట్టుకుంది. శ్రీరామచంద్ర, విశ్వ, యాంకర్ రవిలతోనే ఆనీ మాస్టర్ ఉండేది. విశ్వ, ఆనీ మాస్టర్ల మధ్య కూడా ఎన్నో డిష్యూం డిష్యూంలు అయ్యాయి.
తాజాగా ఆనీ మాస్టర్ నెట్టింట్లో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది. బిగ్ బాస్ ఇంట్లో ఎలిమినేషన్ కాకుండా ఇంకా బాధపడ్డ ఘటనలు ఏమైనా ఉన్నాయా? అని ఓ నెటిజన్ అడిగాడు. దానికి ఆనీ మాస్టర్ అసలు విషయాలన్నీ చెప్పేసింది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో తాను ఎంతగా డిప్రెషన్‌లోకి వెళ్లిందో చెప్పుకొచ్చింది. థర్మకోల్ టాస్క్ తరువాత రాత్రుళ్లు నిద్ర పట్టేది కాదట.. నిద్రలోంచే ఒక్కసారిగా మేలుకోనేదట. ఆ సమయంలో రవి, శ్రీరామచంద్ర, విశ్వలే తోడుగా ఉన్నారట. ఈ విషయాలు ఎవరికి తెలియవంటూ అనీ మాస్టర్ ఆ నాటి సంగతులు గుర్తు చేసుకుంది.

Anee Master shares her feelings
Anee Master : అనీ బాధలు అలా ఉన్నాయా..
బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతూ వస్తోంది. అందుకే కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చేస్తోంది యాజమాన్యం. అందులో భాగంగానే ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభమయ్యింది. అయితే ఈ బిగ్ బాస్ ఓటీటీకి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు .బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికి 5 సీజన్లను పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ మొదటి సీజన్‌కు ఎన్‌టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత సీజన్‌కు నాని హోస్ట్‌గా ఉన్నాడు. ఇక మూడవ సీజన్ నుండి పూర్తిగా నాగార్జుననే బిగ్ బాస్ హోస్ట్ ప్లేస్‌ను టేక్ ఓవర్ చేసేసుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ తెలుగు మొదటి సీజన్‌కు కూడా నాగార్జుననే హోస్ట్.