Hook Step : చిరు హుక్ స్టెప్ పాట‌కి బామ్మ‌లిద్ద‌రు ఇర‌గ‌దీసారుగా.. వైర‌ల్ అవుతున్న వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hook Step : చిరు హుక్ స్టెప్ పాట‌కి బామ్మ‌లిద్ద‌రు ఇర‌గ‌దీసారుగా.. వైర‌ల్ అవుతున్న వీడియో

 Authored By ramu | The Telugu News | Updated on :18 January 2026,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Hook Step : చిరు హుక్ స్టెప్ పాట‌కి బామ్మ‌లిద్ద‌రు ఇర‌గ‌దీసారుగా.. వైర‌ల్ అవుతున్న వీడియో

Mana Shankara Vara Prasad Garu  Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు. విడుదలైన తొలిరోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది.చిరంజీవి కామెడీ టైమింగ్, పవర్‌ఫుల్ డైలాగులు, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులు, గ్రేస్‌ఫుల్ డ్యాన్సులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సినిమాలోని హుక్ స్టెప్ సాంగ్ థియేటర్లలో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఆ పాటకు చిరంజీవి వేసిన స్టెప్పులు, మూమెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ రీల్స్, షార్ట్స్ రూపంలో వైరల్ అవుతున్నాయి.

Hook Step చిరు హుక్ స్టెప్ పాట‌కి బామ్మ‌లిద్ద‌రు ఇర‌గ‌దీసారుగా వైర‌ల్ అవుతున్న వీడియో

Hook Step : చిరు హుక్ స్టెప్ పాట‌కి బామ్మ‌లిద్ద‌రు ఇర‌గ‌దీసారుగా.. వైర‌ల్ అవుతున్న వీడియో

Mana Shankara Vara Prasad Garu  Hook Step డ్యాన్స్ అదుర్స్..

సామాన్యులే కాదు, సెలబ్రిటీలూ ఈ హుక్ స్టెప్‌ను రీక్రియేట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ ఇద్ద‌రు బామ్మ‌లు సెల్ ఫోన్ ప‌ట్టుకొని చిరు హుక్ స్టెప్ ఇర‌గ‌దీసారు. వారి స్టెప్పులు, క‌మిట్‌మెంట్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇక ఈ హుక్ స్టెప్ వెనుక ఉన్న ఆసక్తికర కథను తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ ‘ఆట’ సందీప్ వెల్లడించారు. ఆ స్టెప్ ఎలా పుట్టిందన్న విషయాన్ని ఆయన ఆసక్తికరంగా వివరించారు. మనందరికీ రోజువారీ జీవితంలో సమస్యలు ఉంటాయి. ప్రతి నెలా ఈఎంఐలు కట్టాలి కదా. ఆ సాంగ్‌కు స్టెప్స్ కంపోజ్ చేస్తున్న సమయంలో కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తూ వరుసగా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి.

సాధారణంగా కంపోజింగ్ సమయంలో నేను ఫోన్ తీసుకెళ్లను. కానీ, ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వస్తుందని చెప్పడంతో తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి వచ్చింది. సెట్‌లోకి వెళ్లాక కూడా ఫోన్లు ఆగలేదు. కోపం వచ్చి ఫోన్ పగలకొట్టాలనిపించింది. అలా ఫోన్ పట్టుకున్న క్షణంలోనే ఒక్కసారిగా ఒక ఐడియా మెరిసింది.వెంటనే సెట్‌లోని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, కేవలం ఫోన్ లైట్‌తోనే ఒక స్టెప్ ట్రై చేశాను. అది చూసి నా భార్య కూడా చప్పట్లు కొట్టింది. తర్వాత అదే ఐడియాను మరింత డెవలప్ చేశాం. చిరంజీవిగారి గ్రేస్, స్టైల్‌కు తగ్గట్టుగా స్టెప్‌ను డిజైన్ చేసి, ఇప్పుడు మీరు సినిమాలో చూస్తున్న హుక్ స్టెప్‌ను ఫైనల్ చేశాం” అని సందీప్ మాస్టర్ తెలిపారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది