Annie : రాజ‌న్న చైల్డ్ ఆర్టిస్ట్ ప‌ల్స‌ర్ బైక్ సాంగ్‌కి డ్యాన్స్ చించి ఆరేసిందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: September 13, 2022, 2:00 pm

Annie :  ఇటీవ‌ల ఓ సాంగ్ పాపుల‌ర్ అయిందంటే చాలు దానికి ఎగ‌బ‌డి డ్యాన్స్ లు చేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ప‌ల్స‌ర్ బైక్ సాంగ్ ఫుల్ పాపుల‌ర్ అయింది. ‘‘చింపిరి జుట్టు దాన్ని.. చెవులు ఇరుసున చుట్టదాన్ని.. చేతిలా అగ్గిపెట్టి దాన్ని.. ఉంగరాల మెట్ట దాన్ని.. నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.. పల్సర్ బైక్ పైన రారా బావో.. నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.. పల్సర్ బైక్ పైన రారా బావో..’’ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది ఈ ఫోక్ సాంగ్. ఇన్ స్టాగ్రామ్ రీల్స్.. ఫేస్ బుక్.. ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో ఎక్కడ చూసినా కూడా ఈ పాట హంగామానే న‌డుస్తుంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు ఈ సాంగ్‌కి తెగ స్టెప్పులేస్తూ ర‌చ్చ చేస్తున్నారు.

అమ్మాయిలైతే ఈ పల్సర్ బైక్ పాట పెట్టుకుని నా నామిరంగా అంటూ నాట్యం ఆడేస్తున్నారు. నిజానికి ఈ పాట వింటే ఊపు రావాల్సిందే అనేట్టుగా ఉంది. ఇటీవ‌ల ఓ బ‌స్సు కండ‌క్ట‌ర్ ..‘నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.. పల్సర్ బైక్ పైన రారా బావో’.. అంటూ స్టేజ్‌ని షేక్ చేసింది. ఎంతలా అంటే.. ఆమని లాంటి కూల్ ఉమెన్.. ‘నా వల్ల కావడం లేదు.. నేను కూడా వచ్చి అక్కడ చేయాలనిపిస్తుంది’ అంటూ ఆ డాన్సర్‌తో కలిసి చిందులు వేసింది. ఇక ఇప్పుడు నాగార్జున న‌టించిన రాజ‌న్న చిత్రంలోని చిన్నారి కూడా ఈ పాట‌కు స్టెప్పులేసింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

annie dance video viral on instagram

annie dance video viral on instagram

Annie : అద‌రహో..

అన్నీ ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ సంద‌డి చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. ఈ క్ర‌మంలో పాపుల‌ర్ అయిన ఈ సాంగ్‌కి చిందులేసి ర‌చ్చ చేసింది. ఈ అమ్మ‌డు ‘అనుకోకుండా ఒక రోజు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అన్నీ.. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది. నాగార్జున నటించిన రాజన్న సినిమాలో మల్లమ్మ పాత్రతో మంచి పేరు సంపాదించుకుంది. రంగస్థలం సినిమాలో చరణ్ చెల్లిగా కూడా నటించింది. ఇక గత ఏడాది ఓ వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలను బాగా పంచుకుంటుంది. చిన్న వయసులో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ అవ్వాల‌ని ఈ అమ్మ‌డు భావిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Annie ???? (@thenameis_annie)

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp