Samantha : సమంత ఇంకెన్నాల్లో కష్టం ?? నిజమండీ బాబు ప్రూఫ్ చూడండి కావాలంటే !
Samantha : మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంతకి తన ఒకప్పటి స్కిన్ డిసీజ్ మళ్లీ తిరగపెట్టిందని టాక్. సమంత కెరియర్ పీక్స్ లో ఉన్న టైం లో తన స్కిన్ ఎలర్జీ వల్ల ఓ ఏడాది పాటు సినిమాలు చేయలేదు. ఆ టైం లో కూడా ఫారిన్ ట్రీట్మెంట్ తీసుకుంది. అయినా తగ్గలేదు.. ఫైనల్ గా కేఋఅళ ఆయుర్వేదం తో కొంతవరకు క్యూర్ అయ్యింది. అయితే ప్రస్తుతం మయోసైటిస్ కి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న టైం లో మరోసారి సమంతకి ఆ స్కిన్ డిసీజ్ వచ్చిందట. ఈ రెండిటి వల్ల సమంత చాలా ఇబ్బందులు పడుతుందని అంటున్నారు. ఒకదానికే ఇబ్బంది పడుతున్న సమంత మళ్లీ స్కిన్ డిసీజ్ తిరగ బట్టడంతో మరింత అందోళన చెందుతుందట.
అయితే సమంత ఈ కారణాల వల్ల ఇప్పుడప్పుడే షూటింగ్స్ కానీ.. అసలు బయటకు వచ్చే ఛాన్స్ లేదు. తనకు వచ్చిన వ్యాధి పూర్తిగా నయం అయ్యాకనే సమంతని బయటకి వెళ్లాలని అంటున్నారట. ఈ క్రమంలో సమంత కోసం ఖుషి టీం ఎదురుచూపులు అలానే ఉన్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా వస్తున్న ఖుషి సినిమా కొంత పార్ట్ షూటింగ్ పెండింగ్ లో ఉంది. అసలైతే ఈ నెలలో అది పూర్తి చేసి నవంబర్ ఎండింగ్ కల్లా పోస్ట్ ప్రొడక్షన్ చేసి డిసెంబర్ చివరన సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు. డిసెంబర్ 23 ఖుషి రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు.
కానీ సమంత వ్యాధి వల్ల అంతా మారిపోయింది. ఖుషి సినిమాకు ఆల్టర్నేట్ రిలీజ్ డేట్ వెతుకుతున్నారు చిత్రయూనిట్. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఖుషి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. ఇక సమంతకు వ్యాధి నయం అయ్యేంతవరకు విజయ్ కూడా వేరే ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. సో ప్రస్తుతానికి సమంత వచ్చే దాకా ఖుషి సినిమా హోల్డ్ లో పడినట్టే. ఇదే కాదు శాకుంతలం సినిమా కు కూడా సమంత డబ్ చెప్పాల్సి ఉంది. అది కూడా సమంత కోలుకున్నాకే జరుగుతుంది. సో సమంత బెడ్ మీద ఉండటం వల్ల ఈ రెండు ప్రాజెక్ట్ లకు ఇబ్బంది కలుగుతుంది.