Ante Sundaraniki : పవన్ కళ్యాణ్ గెస్ట్ అంటే టెన్షన్ పడుతున్న నాని ఫ్యాన్స్..?
Ante Sundaraniki : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ అంటే సుందరానికీ. ఈ సినిమా మరికొన్ని గంటల్లో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో నేడు ఘనంగా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ భార్య నజ్రియా ఫహాద్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటించింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్ అందుకున్నాడు నానీ. అయితే, అది భారీ హిట్ మాత్రం కాదనే చెప్పాలి.
అందుకే ఇప్పుడు కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్న అంటే సుందరానికీ సినిమాతో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ట్రైలర్, పాటలు సినిమాపై బాగానే అంచనాలు పెంచాయి. నానీకి ఈసారి హిట్ గ్యారెంటీ అనేలా ఉంది ట్రైలర్.
పాయింట్ పాతదే అయినా కూడా కొత్త ట్రీట్‌మెంట్‌తో సినిమాను ప్రజెక్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక నాని, నజ్రియాల జోడీ మీదే సినిమా సక్సెస్ కూడా మెజారిటీ భాగం ఆధారపడి ఉంది.ఇలాంటి సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవర్ స్టార్ ఛీఫ్ గెస్ట్ అంటే ఎవరికైనా మంచి బూస్ట్ అని చెప్పాలి. కానీ, నాని ఫ్యాన్స్ మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారట.

Ante Sundaraniki movie Pawan Kalyan Guest means Nani fans who are under tension
Ante Sundaraniki: మళ్ళీ రిపీట్ అవుతుందని టెన్షన్ పడుతున్నారు.
దీనికి కారణం పవన్ – నానీ ఒకే మీటర్‌లో ఉండటమే. అంటే ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీపై తీసుకున్న టిక్జెట్ రేట్ సహా కొన్ని కీలక నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉన్నాయని రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఇక నానీ కూడా తన శ్యామ్మ్ సింగరాయ్ సినిమా రిలీజ్ సమయంలోనూ ఏపీ ప్రభూత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అదే ఈరోజు జరగబోతున్న అంటే..సుందరానికీ సినిమాకు మళ్ళీ రిపీట్ అవుతుందని టెన్షన్ పడుతున్నారు. ఈ రోజు పవన్ ఏం మాట్లాడతాడో మళ్లీ ఎలాంటి సమస్యలు పునరావృతం అవుతాయో అని మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఈ ఈవంట్‌లో పవన్ ఎలా స్పందిస్తారో.