Anushka Marriage : పెళ్లి ప‌నుల్లో అనుష్క బిజీ.. అలా చూస్తుండిపోయిన అభిమానులు

Authored By Sam C | The Telugu News | Updated on: February 3, 2022, 5:33 pm

Anushka Marriage : అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి హీరోల ప‌క్క‌న క‌థానాయిక‌గా న‌టిస్తూనే మ‌రోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌ల‌లోను సంద‌డి చేసింది. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒక‌రిగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన ఇప్పుడు మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తుంది. అయితే అనుష్క పెళ్లి విష‌యం గురించి ఎప్పుడు ఏదో ర‌క‌మైన వార్త వ‌స్తూనే ఉంది.నాలుగు పదుల వయసులోనూ నవ యవ్వనంగా కనిపించినా.. ఏ వయసుకి ఆ ముచ్చట జరిగితేనే కదా బావుంటుంది అని అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. ఓ గురూజీ జాతకం ప్రకారం.. అనుష్క వివాహం జనవరి 2023 నాటికి జరుగుతుంది..

వరుడు ఎవరు? ఏ రంగానికి చెందిన వాడు లాంటి విషయాలేవీ వివరించలేదు గురూజీ.గ‌తంలో ప్ర‌భాస్, అనుష్క‌లు పెళ‌ల్ఇ చేసుకోనున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో స్పందించిన వీరు తామిద్ద‌రం స్నేహితులం మాత్ర‌మే అని ఖండించారు. ప్ర‌భాస్ ఇంట్లో ఏ వేడుక జ‌రిగిన అనుష్క హాజ‌రు అవుతుంద‌ట‌. రీసెంట్‌గా రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు స్టాఫ్ స‌భ్యురాలి కుమార్తె పెళ్లి జ‌రిగింది. ఆ పెళ్లికి అనుష్క హాజ‌రైంద‌ని సినీ వ‌ర్గాల్లో బ‌ల‌మైన వార్త‌లు వినిపించాయి. పెళ్లికి వెళ్ల‌డ‌మే కాదు, వాళ్లింటి మ‌నిషిలాగా క‌లిసిపోయి పెళ్లి ప‌నులు కూడా చేసింద‌ని, అందుకు ఓ ఫొటోనే సాక్ష్య‌మ‌ని అంటున్నారు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.

anushka busy with marriage works

anushka busy with marriage works

Anushka Marriage : అనుష్క‌ను అభినందించాలి..

కృష్ణంరాజు స్టాఫ్ కుమార్తె పెళ్లికి వెళ్ల‌డం.. ఫ్రెండ్ షిప్ కోసం ఆమె అలా ప‌నులు చేయ‌డం అనేది నిజ‌మైతే మ‌త్రం నిజంగా అనుష్క‌ను అభినందించాలి అంటున్నారు. ఈ ఫొటో రీసెంట్‌దా, పాత‌దా అనేది కూడా అర్ధం కావడం లేదు. సైజ్ జీరోలో అనుష్క చాలా బ‌రువు పెరిగారు. ఆ బ‌రువు త‌గ్గించుకోవ‌డానికి ఆమె చాలానే క‌ష్ట‌ప‌డ్డారు. ముఖ్యంగా సైలెన్స్ త‌ర్వాత అనుష్క సినిమాల్లో న‌టించ‌లేదు. పూర్తిగా త‌న లుక్‌ను మార్చుకోవ‌డంపైనే ఆమె దృష్టి పెట్టిన‌ట్లు వార్త‌లు వినిపించాయి. ప్ర‌స్తుతం అనుష్క త‌న త‌దుప‌రి సినిమా కోసం సిద్ద‌మ‌వుతుంది. ఇటీవ‌ల మూవీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp