Anushka Shetty | ప్ర‌భాస్ చేతుల మీదుగా అనుష్క ఘాటి రిలీజ్ గ్లింప్స్.. అద‌ర‌గొట్టేసిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anushka Shetty | ప్ర‌భాస్ చేతుల మీదుగా అనుష్క ఘాటి రిలీజ్ గ్లింప్స్.. అద‌ర‌గొట్టేసిందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :4 September 2025,1:00 pm

Anushka Shetty | టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మెరిపించబోతున్నారు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆమె లేటెస్ట్ చిత్రం ‘ఘాటీ’, సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ సమీపిస్తున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్‌ హాట్ టాపిక్‌గా మారాయి.

#image_title

మాస్ అవ‌తార్

ఇప్పటికే బుక్ మై షో, ఇతర టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫార్ములలో పలుచోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ మంచి స్పందన కనిపిస్తోంది. ‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి హిట్ చిత్రాల తర్వాత ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అత్యధిక అంచనాలే నెలకొన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన ఈ గ్లింప్స్ ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తుంది.

దర్శకుడు క్రిష్ ఊహించని యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ గ్లింప్స్ ని నింపేయగా అనుష్క తన ఊచకోత చూపించారని చెప్పాలి. క్రిష్ చెప్పినట్టుగానే అనుష్క విశ్వరూపమే ఈ సినిమాలో కనిపించేలా ఉంది. ఇక ఈ గ్లింప్స్ లో మ్యూజిక్ మరో ఎసెట్ అని చెప్పాలి. కనిపించే విజువల్స్ ని ఎలివేట్ చేసేలా సంగీత దర్శకుడు సాగర్ నాగవెల్లి స్కోర్ సాలిడ్ గా ఉంది. అనుష్క పేల్చిన మాస్ డైలాగ్ తో థియేటర్స్ లో ఆడియెన్స్ ని మంచి రెస్పాన్స్ ని కొల్లగొట్టే ఛాన్స్ గట్టిగా ఉందని చెప్పవచ్చు. మొత్తానికి మాత్రం ఈ కొత్త గ్లింప్స్ మాత్రం మరింత అంచనాలు పెంచే విధంగా ఉందని చెప్పవచ్చు.

 

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది