Prabhas- Anushka | 8 సంవ‌త్స‌రాల త‌ర్వాత జంట‌గా క‌నిపించ‌నున్న అనుష్క‌- ప్ర‌భాస్‌.. ఫ్యాన్స్‌కి పండ‌గే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas- Anushka | 8 సంవ‌త్స‌రాల త‌ర్వాత జంట‌గా క‌నిపించ‌నున్న అనుష్క‌- ప్ర‌భాస్‌.. ఫ్యాన్స్‌కి పండ‌గే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :20 August 2025,4:00 pm

Prabhas- Anushka | టాలీవుడ్‌లో హిట్ జోడీ ప్రభాస్ – అనుష్క పేర్లు ఎప్పుడు వార్త‌ల‌లో నిలుస్తుంటాయి. బిల్లా, మిర్చి, బాహుబలి రెండు పార్ట్స్‌లో నటించిన ఈ జంట, ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది. వీరిద్దరి మధ్య ప్రేమ ఉందన్న వార్తలు ఏళ్లుగా చక్కర్లు కొడుతున్నా, చివరకు అవన్నీ కేవలం రూమర్లేనని తేలిపోయింది. ఈ జంట చివరిసారి బాహుబలి 2 ప్రమోషన్స్‌లో కలిసి కనిపించింది. అప్పటి నుంచి దాదాపు 8 సంవత్సరాలు గడిచినా, వీరిద్దరూ ఒక్కచోట కనిపించలేదు.

#image_title

కలిసి సందడి..

ఇప్పుడు మళ్లీ కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం “ఘాటీ” ఇప్పటికే అనేక వాయిదాల అనంతరం సెప్టెంబర్ 5న విడుదల కాబోతుంది. కానీ ఇప్పటివరకు ప్రమోషన్లు లేకపోవడంతో, మేకర్స్ ఓ భారీ ప్లాన్ చేశారు. సినిమాకు హైప్ తెచ్చేందుకు ప్రభాస్ – అనుష్కలతో స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ హోస్ట్‌గా, అనుష్కను ఇంటర్వ్యూ చేయనున్నట్టు టాక్. ఈ ఇంటర్వ్యూలో ఘాటీ సినిమా విషయాలే కాదు, ఇద్దరి కెరీర్, గత అనుబంధం, వదంతులు, పెళ్లి వంటి ఆసక్తికర విషయాలపై కూడా చర్చ జరిగే అవకాశముంది.ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను సినిమా విడుదలకు ముందు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది