Anushka Shetty : అనుష్క శెట్టి చెఫ్‌గా మారిందా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anushka Shetty : అనుష్క శెట్టి చెఫ్‌గా మారిందా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :28 April 2022,10:00 am

Anushka Shetty: అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డ సినిమాల‌కి ప్ర‌త్యేమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ ను దక్కించుకుంటుందని అంతా భావిస్తే అనుష్క మాత్రం సినిమాలను చాలా లైట్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆమె నుండి భాగమతి మరియు నిశబ్దం సినిమాలు మాత్రమే వచ్చాయి. ఆమె ఎలా ఉన్నా కూడా సినిమాలను నిర్మించేందుకు పెద్ద నిర్మాతలు ఎంతో మంది క్యూ కడతారు. కాని అనుష్క మాత్రం ఆచి తూచి సినిమాను ఎంపిక చేస్తుంది. కమిట్ అయిన సినిమాలకు కూడా డేట్లు అదుగో ఇదుగో అంటూ ఆలస్యం చేస్తుందట.

anushka shetty looks as chef

anushka shetty looks as chef

స‌రికొత్త పాత్ర‌లో

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో పి మహేష్ దర్శకత్వంలో ఒక సినిమా కు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా గత ఏడాదిలోనే పట్టాలెక్కాల్సి ఉంది. స్క్రిప్ట్ వర్క్ కూడా ఎప్పుడో పూర్తి అవ్వాల్సి ఉంది. కాని అనుష్క సరిగా సమయం కేటాయించని కారణంగా ఆలస్యం అవుతూ వస్తుందట. యూవీ క్రియేషన్స్ వారికి అనుష్క తో సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా వారు కూడా ఆమెను బలవంతం చేయడం లేదు. పి మహేష్‌ దర్శకత్వం వహించనున్న ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో నవీన్‌ పోలిశెట్టి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ ఈ నెలలోనే మొదలుపెట్టనున్నారు. మేలో అనుష్క సెట్స్‌పైకి వెళ్లనుంది.

సినిమాలోని ఆమె పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో అనుష్క అంతర్జాతీయ స్థాయి చెఫ్ గా కనిపించబోతుందట. ఆమె పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని.. ఇప్పటి వరకు అనుష్కని చూడని విధంగా చూస్తారంటూ మేకర్స్ చెబుతున్నారు. సినిమాలో జాతిరత్నం నవీన్ పొలిశెట్టి ఉండటం వల్ల సినిమా స్థాయి మరింతగా పెరుగుతోంది. అనుష్క మరియు నవీన్ పొలిశెట్టి ల మద్య సంబంధం సినిమాలో ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇదే నెలలో ప్రారంభం కాబోతుంది. అనుష్క మరియు నవీన్ లేకుండా షూటింగ్ జరుగబోతుంది. వచ్చే నెలలో అనుష్క జాయిన్ అవ్వనున్నట్లుగా సమాచారం అందుతోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది