Radhe Shyam : ఏపీలో ఏం జరుగుతోంది.. రాధేశ్యామ్ కి టికెట్ల రేట్ల పెంపు జీవో అమలు కాలేదు

Authored By Himanshi | The Telugu News | Updated on : 11 March 2022, 9:00 pm

Radhe Shyam : ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందని.. ఇక ముందు విడుదల కాబోతున్న ఈ సినిమాలు అన్నింటికీ కూడా కొత్త జీవో అమలు అయ్యి భారీగా టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు ఆనందం వ్యక్తం చేశారు. నేడు విడుదలైన ప్రభాస్ రాదే శ్యాం సినిమాకి కచ్చితంగా కొత్త టికెట్లు రేట్లు అమలు చేసే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు భావించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా విడుదల కాకపోవడంతో కాస్త గందరగోళం ఏర్పడింది.

థియేటర్ల వద్ద టికెట్ల కు సంబంధించిన హడావుడి ఇంతకు ముందు లాగానే ఉంది. భీమ్లా నాయక్ సినిమాకు ఎలా అయితే టికెట్ల రేట్లు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే రేట్లు కొనసాగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ టికెట్ల రేట్ల విషయంలో అధికారులు స్ట్రిక్ట్ గా వ్యవహరించే అవకాశం లేదు. అంటే ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్లను అమలు చేయాల్సిందే అంటూ ఎవరూ కూడా బలవంతం చేయరు.అధికారికంగా తక్కువ రేట్లు ఉన్నా అనధికారికంగా థియేటర్ల యాజమాన్యం మరియు బయ్యర్లు టికెట్ల రేట్లను భారీగా పెంచుకునే అవకాశం అయితే ఉంది.

ap movie tickets rates go not apply for Radhe Shyam

ap movie tickets rates go not apply for Radhe Shyam

కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంపు విషయం లో పూర్తి స్పష్టత ఇవ్వలేదు. జోవో కు సంబంధించిన కొంత పెండింగ్ వర్క్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే అధికారికంగా టికెట్ల రేట్లు పెంచే అవకాశం లేదు. అయితే ఈ నెల 25వ తారీఖున రాబోతున్న జక్కన్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ కు మాత్రం కచ్చితంగా టికెట్ల రేట్లు పెరుగుతాయని టాలీవుడ్ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.

Himanshi

No bio available for this author.

  1. "Pradeep Rawat : టాలీవుడ్ స్టార్ విలన్ ప్రదీప్ రావత్.. కోట్ల ఆస్తి వెనుక అసలు కథ..!"

  2. "Karthika Deepam 2 Today Episode August 05 : సూరజ్‌ను దత్తత తీసుకుంటానన్న శ్రీధర్.. జ్యోత్స్నకు భారీ షాక్!"

  3. "Gold Rate Today : గుడ్‌న్యూస్‌.. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. ఆగస్టు 5 తాజా గోల్డ్ రేట్లు ఇవే!"

  4. "Sprouted Green Gram : కోడిగుడ్లు, పాలకంటే ఎక్కువ ప్రొటీన్.. ఈ సూపర్ ఫుడ్ తెలుసా?.. రోజూ గుప్పెడు చాలు!"

  5. "Fennel Water : డయాబెటిస్ ఉన్నవారికి ఈ నీరు వరమా?.. రోజూ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

  6. "Tirumala : తిరుమలలో రూమ్ దొరకలేదా? అయితే నిరాశ చెందొద్దు.. టీటీడీ ఉచితంగా అందిస్తున్న ఈ సదుపాయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!"

  7. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp