Apasara Rani : పొడుగ్గా ఉంటే ఇష్టమన్న హీరోయిన్.. దెబ్బకు షాకైన ఆర్జీవీ.. వీడియో

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 10, 2021, 2:00 pm

Apasara Rani అప్సరా రాణి Apasara Rani అనే ఓ హీరోయిన్ ఉందన్న సంగతి రామ్ గోపాల్ వర్మ RGV వల్లే తెలిసింది. అంతకు ముందు ఓ రెండు సినిమాలు చేసి ఉన్నా కూడా అంతగా గుర్తింపు రాలేదు..కానీ ఎప్పుడైతే వర్మ కంట్లో ఈ అందం పడిందో.. ఒక్కసారిగా అప్సర రాణి ఫేమస్ అయింది. అప్సరా రాణి అనే పేరు కూడా మన వర్మే పెట్టేశాడు. అప్పటి నుంచి ఆర్జీవీతో అప్సర చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు.

Apasara Rani And RGV Conversation

Apasara Rani And RGV Conversation

పొడుగ్గా ఉంటే ఇష్టమన్న హీరోయిన్.. దెబ్బకు షాకైన ఆర్జీవీ Apasara Rani

ఇప్పటికే అప్సరతో రెండు సినిమాలు లైన్‌లో పెట్టేశాడు. వర్మ, అప్సరాలు కలిసి ప్రైవేట్‌గా ఎంతో సాన్నిహిత్యంగా ఉంటున్నారు. అర్దరాత్రుళ్లు కూడా మాట్లాడుకుంటారు.. వీడియోలు, ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. తాజాగా అప్సర మీద వర్మ ఓ కామెంట్ చేశాడు. ఓ వీడియోను షేర్ చేస్తూ.. నువ్ నీతో ప్రేమలో పడ్డట్టున్నావ్.. మరి మా లాంటి బీదవాళ్ల సంగతి ఏంటి? అని అప్సరాను అడిగాడు వర్మ.

Apasara Rani And RGV Conversation

Apasara Rani And RGV Conversation

అవును నేను నాతో ప్రేమలో ఉన్నాను, అలాగే ఓ మంచి వ్యక్తి కోసం చూస్తున్నాను అని అప్సరా అంది. ఎలాంటి లక్షణాలున్న వాడు కావాలి అని వర్మ అడిగాడు. పొడుగ్గా ఉండాలి.. హ్యాండ్సమ్‌గా ఉండాలని అప్సర చెప్పింది. దీంతో షాకైన వర్మ.. హిమాలయాలకు వెళ్లి సన్యాసిగా మారిపోతాను.. వచ్చే జన్మలో ట్రై చేసుకుంటాను అని చెప్పేశాడు.

Apasara Rani And RGV Conversation

Apasara Rani And RGV Conversation

 

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp