Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ తప్పదా.. మూడు నెలలు జైలు శిక్ష పడేచాన్స్..!
ప్రధానాంశాలు:
Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ తప్పదా.. మూడు నెలు జైలు శిక్ష పడేచాన్స్..!
Ram Gopal Varma : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు Ram Gopal Varma ముంబై కోర్ట్ Mumbai COurt నాన్ బెయిలబుల్ వారెంట్ తో షాక్ ఇచ్చింది. 2018 లో నిర్మాణ సంస్థ శ్రీ అధినేత మహేష్ మిశ్రా ఆర్జీవి మీద చెక్ బౌన్స్ కేసు వేశారు. అంధేరి మెజిస్ట్రేట్ లో ఈ కేసు దాదాపు 7 ఏళ్లుగా నడుస్తుంది. 2022 లో ఐదు వేల పూచికత్తుతో ఆర్జీవీకి బెయిల్ ఇచ్చింది.
ఐతే ఎన్ని సమన్లు పంపించినా ఆర్జీవీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అందుకే ఆర్జీవికి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ విషయంపై ఆర్జీవి ఎలా స్పందిస్తాడన్నది చూడాలి. తన తెలివి తేటలతో లీగల్ ఇష్యూస్ ని ఎప్పటికప్పుడు క్లవర్ గా ఆన్సర్ ఇస్తూ వస్తున్న ఆర్జీవీ అరెస్ట్ తప్పేలా లేదు…
Ram Gopal Varma సత్య రోజులను గుర్తుచేసుకుంటూ..
ఈమధ్యనే సోషల్ మీడియాలో సత్య రోజులను గుర్తుచేసుకుంటూ సిండికేట్ అనే అనౌన్స్ చేశాడు. ఈ సినిమా లో అమితాబ్, వెంకటేష్ లాంటి స్టార్స్ ఇందులో నటిస్తారని తెలుస్తుంది. మరి ఆర్జీవి నెక్స్ట్ స్టెప్ ఏంటి. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడా లేదా అన్నది చూడాలి. ఈమధ్య ఆర్జీవి ఆఫీస్ కి ఏపీ పోలీసులు కూడా వెళ్లిన విషయం తెలిసిందే.