Game Changer : గేమ్ ఛేంజ‌ర్‌ని టార్గెట్ చేసిన వ‌ర్మ‌.. బ‌న్నీ కాళ్ల మీద ప‌డాల‌ని ఉందంటూ ట్వీట్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Game Changer : గేమ్ ఛేంజ‌ర్‌ని టార్గెట్ చేసిన వ‌ర్మ‌.. బ‌న్నీ కాళ్ల మీద ప‌డాల‌ని ఉందంటూ ట్వీట్..

 Authored By ramu | The Telugu News | Updated on :14 January 2025,11:30 am

ప్రధానాంశాలు:

  •  Game Changer : గేమ్ ఛేంజ‌ర్‌ని టార్గెట్ చేసిన వ‌ర్మ‌.. బ‌న్నీ కాళ్ల మీద ప‌డాల‌ని ఉందంటూ ట్వీట్..

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ చేసే కామెంట్స్ నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారుతూ ఉంటాయి. ఈ మ‌ధ్య మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఉంటారు. తాజాగా రామ్ చ‌ర‌ణ్ న‌టించిన గేమ్ ఛేంజ‌ర్‌ని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించాడు. ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా విడుదల భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ. 186 కోట్లు కలెక్ట్ చేసిందంటూ మేకర్స్ పోస్టర్ వదలడంపై రామ్‍గోపాల్ వర్మ ఈ మూవీ బడ్జెట్, వసూళ్ల విష‌యంలో సంచ‌ల‌న పోస్ట్ పెట్టాడు.

Game Changer గేమ్ ఛేంజ‌ర్‌ని టార్గెట్ చేసిన వ‌ర్మ‌ బ‌న్నీ కాళ్ల మీద ప‌డాల‌ని ఉందంటూ ట్వీట్

Game Changer : గేమ్ ఛేంజ‌ర్‌ని టార్గెట్ చేసిన వ‌ర్మ‌.. బ‌న్నీ కాళ్ల మీద ప‌డాల‌ని ఉందంటూ ట్వీట్..

గేమ్ ఛేంజ‌ర్ టార్గెట్..

‘గేమ్ ఛేంజర్’ సినిమా ఓపెనింగ్ డే ఒరిజినల్ గా 80 – 89 కోట్ల మధ్య వసూళ్లు సాధిస్తే, రూ.186 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని మూవీ టీమ్ ఫేక్ పోస్టర్లు వేసినట్లుగా నెటిజన్లు కొంద‌రు ట్వీట్స్ చేశారు. ఈ క్ర‌మంలో ఆర్జీవి కూడా గేమ్ ఛేంజర్ ను GC అని ప్రస్తావిస్తూ.. తనదైన శైలిలో పోస్టులు పెట్టారు. జీసీకి తొలి రోజే రూ.186 కోట్లు వచ్చింది నిజమే అయితే, ‘పుష్ప 2’ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.1860 కోట్లుగా ఉండాలని పేర్కొన్నారు. దాదాపు 450 కోట్లు ఖర్చయ్యింటే.. ఇంతకు ముందెన్నడూ చూడని విజువల్ అప్పీల్‌లో తీసిన ఆర్ఆర్ఆర్ మూవీకి 4500 కోట్లు ఖర్చు చేయాలి ఉండాలి.

జీసీ విషయంలో ఆ అబద్ధం మరింత నమ్మదగినదిగా ఉండాలి” అని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ పెట్టారు..అమాయకపు అబద్ధాల వెనుక ఎవరున్నారో నాకు తెలియదు కానీ, ఖచ్చితంగా అది నిర్మాత దిల్ రాజు మాత్రం కాదు. ఎందుకంటే అతను నిజమైన గ్రౌండెడ్ రియలిస్ట్ పర్సన్. అతనికి ఫ్రాడ్ చేయడం చేతకాదు” అని ఆర్జీవీ పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి “నాకు పుష్ప-2 నచ్చింది కానీ ఇప్పుడు GC చూసిన తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాళ్ల మీద పడాలని ఉంది” అంటూ మరో సంచ‌లన పోస్ట్ పెట్టాడు. వ‌ర్మ చేసినఈ పోస్ట్ ప్ర‌స్తుతం నెటిజ‌న్స్‌ని ఆలోచ‌న‌లో ప‌డేలా చేస్తున్నాయి. వ‌ర్మ ఇలా చేయ‌డం వెన‌క కార‌ణం ఏంట‌ని కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది