Mohini Dey : అసిస్టెంట్ మోహినీ దేతో ఏఆర్ రెహమాన్ ఎఫైర్ పై సైరాబాను లాయ‌ర్ క్లారిటీ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mohini Dey : అసిస్టెంట్ మోహినీ దేతో ఏఆర్ రెహమాన్ ఎఫైర్ పై సైరాబాను లాయ‌ర్ క్లారిటీ..?

 Authored By ramu | The Telugu News | Updated on :21 November 2024,1:30 pm

ప్రధానాంశాలు:

  •  Mohini Dey : అసిస్టెంట్ మోహినీ దేతో ఏఆర్ రెహమాన్ ఎఫైర్ పై సైరాబాను లాయ‌ర్ క్లారిటీ..?

Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman  భార్య సైరా బాను Saira Banu తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడం సంచ‌ల‌నం రేపింది. స‌డెన్‌గా ఈ జంట ఎందుకు విడిపోతున్నారో ఎవ‌రికి అర్ధం కాలేదు. ఏఆర్ రెహమాన్ నుండి విడిపోతున్నట్లు ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ మధ్య సయోధ్య చేయలేని దూరం పెరిగిపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని సైరా బాను తన ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఏఆర్ రెహమాన్‌కు ఆయన భార్య విడాకులు ఇవ్వడంపై సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. దాదాపు 29 సంవత్సరాల తన వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.

Mohini Dey అది కార‌ణం కాదు..

అయితే ఇదే సమయంలో ఏఆర్‌ రెహమాన్‌ టీమ్‌లోని మోహినిదే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం అందరినీ షాక్​కు గురి చేసింది. ఏఆర్‌ రెహమాన్‌ దంపతులు విడిపోతున్నట్లుగా ప్రకటించిన కొద్ది గంటల్లోనే మోహినిదే కూడా డివోర్స్‌పై ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు విడాకులకు ఏదైనా సంబంధం ఉందా? అంటూ చాలా మంది చర్చించుకోవడం మొదలు పెట్టారు. అసలు మెహినిదే ఎవరని ఆరా తీస్తున్నారు. రెహమాన్ విడాకులకు – మోహినిదే డివోర్స్​కు ఏదైనా సంబంధం ఉందా? అంటూ వస్తోన్న వార్తలపై రెహమాన్ భార్య సైరా తరఫు లాయర్‌ వందన స్పందించారు. అలాంటిదేమీ లేదని స్పష్టత ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే రెహమాన్‌ – సైరా దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Mohini Dey అసిస్టెంట్ మోహినీ దేతో ఏఆర్ రెహమాన్ ఎఫైర్ పై సైరాబాను లాయ‌ర్ క్లారిటీ

Mohini Dey : అసిస్టెంట్ మోహినీ దేతో ఏఆర్ రెహమాన్ ఎఫైర్ పై సైరాబాను లాయ‌ర్ క్లారిటీ..?

మోహిని దే ..11ఏళ్ల వయస్సులోనే బాస్ గిటారిస్టుగా మంచి పేరు సంపాదించుకుంది. మోహినికి మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి సుజయ్ డే బాస్ గిటార్ తన చేతికందించాడు. అలా మూడేళ్ల వయస్సు నుంచే బాస్ గిటార్ తో మోహిని ఫ్రెండ్షిప్ షురూ అయ్యింది. 9ఏళ్ల వయస్సులో తొలిసారిగా సంగీత రంగంలోకి అడుగుపెట్టింది. మోహిని జులై 20, 1996న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 28ఏళ్లు. కొన్నేళ్లుగా ఆమె జాకీర్ హుస్సేన్, శివమణి, విల్లో స్మిత్, స్టీవ్ వాయ్ తోపాటు పలువురు ఇంటర్నేషనల్ కళాకారులతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. Mohini Dey , ar rahman bassist dropped separation by mohini dey , Saira Banu, ar rahman

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది