AR Rahman : చెత్త సినిమాకు ఆస్కార్ అవార్డు ఇచ్చారు .. ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు .. షాక్ లో రాజమౌళి !!
AR Rahman : ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏఆర్ రెహమాన్ పాటలను ఇష్టపడని వారు ఉండరు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఏఆర్ రెహమాన్ అన్ని భాషలలో ఆయన పాటలు కంపోజ్ అవుతాయి. ఈయన పాటలు వింటే మనసుకు హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుందని ఆయన అభిమానులు చెప్పుకొస్తుంటారు. అయితే ఇటీవల ఆస్కార్ అవార్డ్ ను ఆర్ఆర్ఆర్ సినిమా సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు.
అర్హత లేని సినిమాలకు ఆస్కార్ అవార్డు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొన్ని సినిమాలు ఆస్కార్ అవార్డులను గెలుస్తాయని అనుకున్నాను కానీ కనీసం అవి ఆస్కార్ కి కూడా నామినేట్ కాలేదు. కానీ జనాలు ఆ సినిమాలను, ఆ పాటలను ఎంతో ఇష్టపడతారని, ఎందుకు ఆస్కార్ అకాడమీ అలాంటి మంచి సినిమాలను గుర్తించడం లేదు అని ఏఆర్ రెహమాన్ ఫైర్ అయ్యారు. ఇటీవల ఏఆర్ రెహమాన్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఆస్కార్ అకాడమీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కి ఆస్కార్ అవార్డులు వచ్చాయి. భారతీయ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం ఇదే తొలిసారి. చాలా సంతోషంగా ఉంది .అయితే గతంలో ఎన్నోసార్లు చెత్త సినిమాలకు కూడా ఆస్కార్లు వచ్చాయి. అలాంటి పరమ చెత్త సినిమాలు ఆస్కార్ కి నామినేట్ అయ్యాయి. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకో తెలియదు కొన్నిసార్లు ఇండస్ట్రీలో మంచి టాలెంట్ ని తొక్కేస్తూ ఉంటారు అని ఏఆర్ రెహమాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పరోక్షంగా మంచి సినిమాలను ఆస్కార్ కి సెలెక్ట్ చేయడం లేదని అసలు వాటిని గుర్తించడం లేదని మండిపడ్డారు. దీంతో ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.