AR Rahman : రామ్ చరణ్ కోసం రెహమాన్.. బుచ్చి బాబు మెగా ప్లాన్ ఈ రేంజ్ లోనా..?
ప్రధానాంశాలు:
AR Rahman : రామ్ చరణ్ కోసం రెహమాన్.. బుచ్చి బాబు మెగా ప్లాన్ ఈ రేంజ్ లోనా..?
AR Rahman : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan గేమ్ ఛేంజర్ తర్వాత చేస్తున్న సినిమా బుచ్చి బాబు Buchchi Babu డైరెక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఉప్పెనతో తొలి హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చి బాబు తన నెక్స్ట్ సినిమాను రామ్ చరణ్ లాంటి స్టార్ ని ఒప్పించడం అనేది మామూలు విషయం కాదు. ఐతే ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా బుచ్చి బాబు ప్లాన్ అదిరిపోయింది. కన్నడ శివ రాజ్ కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక మ్యూజిక్ విషయంలో కూడా బుచ్చి బాబు సూపర్ టేస్ట్ ఉందని ఉప్పెన తో అర్ధమైంది. అందుకే చరణ్ సినిమాకు కూడా అకడమీ అవార్డ్ విన్నర్ రెహమాన్ ని దించుతున్నారు. ఇప్పటికే చరణ్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయగా రెహమాన్ కూడా ఈ సినిమాకు పనిచేస్తున్నట్టు రీసెంట్ గా మీడియా ఇంటారాక్షన్ లో అన్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ కి తారాస్థాయి అంచనాలు ఉన్నాయి.
AR Rahman రామ్ చరణ్ తొలిసారి పనిచేస్తున్నాడు..
ఐతే చరణ్ AR Rahman రెహమాన్ ఈ కాంబో పై మెగా ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. రెహమాన్ తో చరణ్ తొలిసారి పనిచేస్తున్నాడు. రామ్ చరణ్ కి సరైన మ్యూజిక్ అందిస్తే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. సినిమా తప్పకుండా రెహమాన్ మార్క్ మ్యూజిక్ తో అలరిస్తాడని చెప్పొచ్చు. రెహమాన్ తన దగ్గరకు వచ్చిన ప్రతి సినిమాను చేయడు. కేవలం కథ తనని ఇన్ స్పైర్ చేస్తేనే చేస్తాడు.
ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు అతని మ్యూజిక్ సూపర్ హైలెట్ అవ్వనుంది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తైన ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి RC 16 సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. రామ్ చరణ్ లుక్స్ ఇంకా సినిమా స్టోరీ అదిరిపోయాయంటూ ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. Rahaman for Ram Charan Movie, Bucchi Babu Mega Plan