God Father Movie : ఆచార్య ఫ్లాప్ కి.. గాడ్‌ ఫాదర్‌ హిట్ కి ఒకటే కారణం.. అదేంటి అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

God Father Movie : ఆచార్య ఫ్లాప్ కి.. గాడ్‌ ఫాదర్‌ హిట్ కి ఒకటే కారణం.. అదేంటి అంటే..!

 Authored By prabhas | The Telugu News | Updated on :6 October 2022,1:00 pm

God Father Movie : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ టాక్ దక్కించుకుంది, సినిమాకు కేవలం వారం పది రోజులు మాత్రమే ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారని ఇలా అయితే వసూళ్లు ఎలా నమోదు అవుతాయి అంటూ మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాకు భారీగా కలెక్షన్స్ రావాలంటే భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలని అంతా భావించారు. కానీ ఆచార్య సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించిన కూడా కలెక్షన్స్ ఏ స్థాయిలో వచ్చాయో అందరికీ తెలిసిందే. అందుకే గాడ్ ఫాదర్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కాస్త తెలివిగా కేవలం వారం రోజుల ముందే అది కూడా నార్మల్ గానే ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఆ ప్రమోషన్ కార్యక్రమాల కోసం మెగాస్టార్ చిరంజీవి నాన్న ఐరాన పడిందేమీ లేదు.

అయినా కూడా గాడ్ ఫాదర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని మొదటి రోజే ఏకంగా 35 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా లాంగ్ రన్ లో కూడా ఈ స్థాయి వసూళ్లను నమోదు చేయలేక పోయింది అనేది అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమాలో రామ్ చరణ్ మరియు చిరంజీవి కలిసి నటించిన కూడా సక్సెస్ అవ్వలేదు. ఆచార్య సినిమా సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి..? గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? అంటూ ఇప్పుడు మెగా ఫాన్స్ తో పాటు సినీ విశ్లేషకులు కొందరు విశ్లేషించే పనిలో పడ్డారు. ఎక్కువ శాతం అంటున్న విషయం ఏంటంటే గాడ్ ఫాదర్ సినిమా విషయంలో ఎక్కువగా చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఉంది, దర్శకత్వం స్క్రీన్ ప్లే ఇలా ప్రతి విషయంలో కూడా చిరంజీవి సలహాలు మరియు సూచనల మేరకు దర్శకుడు మోహన్ రాజా సన్నివేశాలను చిత్రీకరించడం జరిగిందట.

why God Father Movie hit and acharya flop

why God Father Movie hit and acharya flop

కానీ ఆచార్య విషయంలో మాత్రం దర్శకుడు కొరటాల శివ పై పూర్తి నమ్మకం ఉంచిన చిరంజీవి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేశాడట. వరుసగా సినిమాలతో సక్సెస్ దక్కించుకున్న కొరటాల శివ పై చిరంజీవి నమ్మకం ఉంచడం వల్లే ఆచార్య ఫలితం అలా అయింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆచార్య సినిమా సన్నివేశాలు లేదా ఎడిటింగ్ ఏ ఒక్క విషయంలో కూడా చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదు, కానీ గాడ్ ఫాదర్ సినిమా విషయంలో మాత్రం చిరంజీవి చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. చివరకు విలన్ పాత్రలో సత్యదేవ్ నటిస్తే బాగుంటుందని సూచించింది తానే అని చిరంజీవి పేర్కొన్నాడు. ఇంకా చాలా విషయాల్లో చిరంజీవి ఇన్పుట్స్ ఉపయోగపడ్డాయని చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా మాట్లాడుకుంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది