Akhil : అఖిల్ మీదకు ఎక్కిన అరియానా.. మామూలు విషయం కాదు
Akhil : బిగ్ బాస్ నాల్గో సీజన్ ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు. అంతకు ముందు ఎవ్వరికీ తెలియని వారు బిగ్ బాస్ షోతో సోషల్ మీడియాలో స్టార్లుగా మారిపోయారు. అందులో అఖిల్, సోహెల్, అరియానా వంటి వారుంటారు. అయితే బిగ్ బాస్ షో తరువాత చాలా మందికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. స్టేజ్ షోలో, సినిమాలు, బుల్లితెరపై ఇతర ఈవెంట్లు ఇలా రకరకాల ఆఫర్లతో బిగ్ బాస్ కంటెస్టెంట్లు మంచి ఊపులో ఉన్నారు. తాజాగా బిగ్ బాస్ గ్యాంగ్ కాకినాడకు వెళ్లినట్టు కనిపిస్తోంది.

Ariyana And Akhil Sarthak At ZEE Telugu Event
అరియానా ఇప్పుడు బుల్లితెర, వెండితెరపై ఆఫర్లు పట్టేస్తోంది. ఇక బుల్లితెరపై అయితే కామెడీ షోలు, పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లలో దుమ్ములేపుతోంది. మరో వైపు సినిమా అవకాశాల్లోనూ దూసుకుపోతోంది. ఇక అఖిల్ సైతం సినిమా ఆఫర్లతో ముందున్నాడు. సినిమాలు, వెబ్ సిరీస్‌లంటూ అఖిల్ మంచి ఫాంలో ఉన్నాడు. ఇక పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లు, చానెళ్లు చేసే స్పెషల్ ప్రోగ్రాంలలోనూ అఖిల్ మెరిసిపోతోన్నాడు.
Akhil ఈవెంట్‌లో అరియానా, అఖిల్ రచ్చ :

Ariyana And Akhil Sarthak At ZEE Telugu Event
తాజాగా ఈ ఇద్దరూ కాకినాడకు వెళ్లారు. జీ తెలుగు అవార్డుల ఈవెంట్ కోసం అరియానా, అఖిల్ కాకినాడకు వెళ్లారు. అక్కడ ఈ ఇద్దరూ ఓ పర్ఫామెన్స్ చేసినట్టు కనిపిస్తోంది. అందులో అఖిల్ మీద అరియానా ఎక్కేసింది. రోప్స్ సాయంతో ఏదో విన్యాసాలు చేసేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. అఖిల్ భుజాల మీద అరియానా ఎక్కి నిల్చుంది. అది ఎంత ప్రమాదమైన పర్ఫామెన్సో మాకు తెలుసు అంటూ అభిమానులు తెగ ఫీలవుతున్నారు.