Ariyana: ఆరియానాని ఇలా చూస్తే ఆర్జీవీ కాదు ఎవరైనా పడిపోవాల్సిందే

Authored By vamana sai | The Telugu News | Updated on: August 21, 2021, 2:30 pm

Ariyana: యూట్యూబ్ యాంకర్ గా ఉన్నప్పుడు రాని క్రేజ్ అరియానాకి వర్మ కామెంట్ తో వచ్చేసింది. అది బిగ్ బాస్ వరకు తీసుకు వెళ్ళింది. అరియానా దగ్గర ఏం చూశాడో కానీ ఆమెకి ఓట్ చేయమని కూడా సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ అందరికీ సలహా ఇచ్చాడు. ఇటీవల ఆమెతో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసి కూడా తనకి బాగా క్రేజ్ తెచ్చిపెట్టాడు. దాంతో ఆ యంగ్ బ్యూటీ అసలు ఆగడం లేదు. లేటెస్ట్ ఫొటో షూట్స్ తో రెచ్చిపోతుంది. తాజాగా ట్రెండీ వేర్‌లో అరియానా అందరికీ తన ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తుంది.

ariyana-latest pics goes viral

ariyana-latest pics goes viral

రెడ్‌ టాప్‌, జీన్ ప్యాంట్‌లో రక రకాల ఫోజులిచ్చి ఆకట్టుకుంటోంది. తాజాగా అరియానా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక అరియానా బాగా అందరి దృష్టి తన మీద పడేలా కాస్త ఘాటుగా కనిపిస్తోంది. వీలైనంత పొదుపుగా బట్టు వేసుకొని హాట్ టాపిక్ అవుతోంది. తను ఏం చేసిన జనాలు తన గురించి ప్రత్యేకంగా చర్చలు జరపాలనేదే ఆమె ఫైనల్ టార్గెట్ అని అర్థమవుతోంది. అంతేకాదు ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు చూస్తే ఆర్జీవీ మాత్రమే కాదు ఎవరైనా ఫ్లాటవ్వాల్సిందే అన్నట్టు ఉన్నాయి.

Ariyana: ఆరియానా మరో అప్సర రాణి లా ఐటెం సాంగ్స్ లో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదట

 

ఇలా ఎప్పటికప్పుడు అరియానా తీసుకుంటున్న లేటెస్ట్ ఫొటోస్ నెటిజన్స్ తో పంచుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగేలా చూసుకుంటోంది. చూస్తుంటే ఆరియానా మరో అప్సర రాణి లా ఐటెం సాంగ్స్ లో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు కారణం ప్రస్తుతం ఆర్జీవీ ఫోకస్ అరియానా మీద బాగానే ఉంది కాబట్టి. ఇక తను కూడా ఇలా ఫొటో షూట్స్ తో మేకర్స్ ని ఆకట్టుకుంటూ సొంత ప్రయత్నాలు కూడా చేస్తోందట. మరి తెలుగు ఇండస్ట్రీలో అరియానా హీరోయిన్ అవుతుందా, ఐటం సాంగ్స్ చేస్తుందా చూడాలి.

 

 

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp