Ashu Redddy : మీకు పుట్టే పిల్లలు అలానే ఉంటారు!.. ఎక్స్‌ప్రెస్ హరి అషూలపై ట్రోలింగ్!
Ashu Redddy బుల్లితెరపై టీఆర్పీ కోసం కొందరు కొన్ని ఫీట్లు చేస్తుంటారు. తమ మధ్య ఏమీ లేకపోయినా కూడా స్క్రీన్ స్పేస్, జనాల అటెన్షన్ కోసం తెగ ఆరాటపడుతుంటారు. అలాంటి బ్యాచుల్లో వర్ష ఇమాన్యుయేల్, హరి అషూ రెడ్డి వంటి వారు వస్తారు. కామెడీ స్టార్స్ షోలో అషూ రెడ్డి, హరి చేసే రచ్చ మామూలుగా ఉండదు. టాటూలతో హరి ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఎక్స్ ప్రెస్ హరి తన స్కిట్లో భాగంగా అషూ మీద ప్రేమను కురిపిస్తాడో.. ప్రేమిస్తున్నట్టు నటిస్తాడో అర్థం కాదు.

Ashu Redddy And Expree Hari Gets Trolled
కానీ అషూ రెడ్డిని హరి నిజంగానే ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుంటుంది. ఇక అషూ రెడ్డి సైతం హరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనిపిస్తుంటుంది. కానీ తెర వెనుక అయితే అన్నయ్య అని పిలిచేది. ఇప్పుడు మాత్రం ఫ్రెండ్ అంటూ వరస మార్చేసింది. ఈ ఇద్దరూ తెర ముందుకు వస్తే దారుణంగా జీవించేస్తారు. ఈ మధ్య హరి కోసం అషూ రెడ్డి బైకును గిఫ్ట్‌గా కొనిచ్చింది. ఈ విషయాన్ని కామెడీ స్టార్స్ షోలో బయటపెట్టేసింది. ఆ బైకును సర్ ప్రైజ్‌గా చూపించింది.
Ashu Redddy నెటిజన్‌కు అషూ ఘాటు రిప్లై

Ashu Redddy And Expree Hari Gets Trolled
అయితే టాటూలతో హరి, ఇలా బైక్ గిఫ్ట్‌తో అషూ నానా హంగామా చేస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరి ఫోటో మీద ఓ నెటిజన్ తీవ్రంగా విమర్శలు చేశాడు. ఆ బొగ్గు గాడు ఎలా నచ్చాడు.. వాడిని ఎలా ప్రేమించావ్.. వాడితో పెళ్లి అయితే నీకు పుట్టే పిల్లలు కూడా బొగ్గులానే పుడతారు అంటూ నానా రకాలుగా కామెంట్ చేశాడు. దానిపై అషూ రెడ్డి భగ్గుమంది. నీకు అసలు ఫ్రెండ్ షిప్ అంటే ఏంటో తెలుసా?అని ఎదురు ప్రశ్నించింది. తామిద్దరం మంచి స్నేహితులం, స్నేహంలో వర్ణబేధం ఉండదని చెప్పకనే చెప్పేసింది.